తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్మించిన కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పారు. వుడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మంటలు చెలరేగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈనెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. దీంతో సచివాలయ పనులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. వర్క్ జరుగుతున్న క్రమంలో మంటలు చెలరేగాయి.
తెలంగాణ సెక్రటేరియట్ మొత్తం విస్తీర్ణం 28 ఎకరాలు. ఇందులో 10, 51,676 చదరపు అడుగుల్లో భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎత్తు 265 అడుగులు. దేశంలోనే అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటి. ఈ భవనంపై ఏర్పాటు చేస్తున్న జాతీయ చిహ్నాన్ని కూడా కలిపితే మొత్తం ఎత్తు 278 అడుగులవుతుంది.
11 అంతస్తుల ఎత్తులో ఈ భవనం కనిపిస్తుంది కాని ఇందులో ఉన్నవి ఆరు అంతస్తులు మాత్రమే. డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మించిన ఈ భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ సంప్రదాయంతో పాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. ఈ పరిపాలనా సౌధానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ పేరు పెట్టాలని గతేడాది సెప్టెంబర్‌లోనే నిర్ణయించారు.
భారీ విస్తీర్ణంతో నిర్మించినప్పట్టికీ అతి తక్కువ సమయంలోనే ఈ భవనాన్ని పూర్తి చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి జూన్ 27, 2019న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూలై 2020లో పాత భవనాల కూల్చివేత మొదలైంది. శిధిలాల తొలగింపు పనులకే నాలుగు నెలలు పట్టింది. ఏకంగా 14వేల టక్కుల లోడ్ల శిధిలాలు తొలగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం