Telangana: జలపాతంలో దూకి మహిళా యూట్యూబర్‌ ఆత్మహత్యాయత్నం..

|

Jul 15, 2023 | 8:38 AM

ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల జలపాతంలో దూకి ఓ మహిళా యూట్యూబర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే.. ఆమె కదలికలను గుర్తించిన పోలీసులు, ఫారెస్ట్‌ సిబ్బంది క్షేమంగా కాపాడారు. ఎందుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందనే దానిపై ఆరా తీశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. మానసిక స్థితి బాగులేక ఆత్మహత్య చేసుకుంనేందుకు కారులో...

Telangana: జలపాతంలో దూకి మహిళా యూట్యూబర్‌ ఆత్మహత్యాయత్నం..
Kuntala Waterfalls (file Photo)
Follow us on

ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల జలపాతంలో దూకి ఓ మహిళా యూట్యూబర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే.. ఆమె కదలికలను గుర్తించిన పోలీసులు, ఫారెస్ట్‌ సిబ్బంది క్షేమంగా కాపాడారు. ఎందుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందనే దానిపై ఆరా తీశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. మానసిక స్థితి బాగులేక ఆత్మహత్య చేసుకుంనేందుకు కారులో హైదరాబాద్ నుంచి కుంటాల జలపాతానికి వెళ్లిన ఓ యూట్యూబర్‌ను పోలీసులు రక్షించారు.

ఇచ్చోడ సీఐ చంద్ర శేఖర్, ఎస్ ఐ సాయ్యన్న, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. హైదరాబాద్ మధురానగర్ కాలనీకి చెందిన కట్ట మైథిలి అనే మహిళ ఉదయం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా కుంటాల జలపాతంలో ఆత్మహత్య చేసుకునేందుకు బయలు దేరింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి ఎల్లారెడ్డి వెంటనే మధురానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు నేరడిగొండ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. అప్రమత్తం అయిన సీఐ, ఎస్ఐ వెంటనే గ్రామ సర్పంచ్ అశోక్‌కు తెలిపారు. అలెర్ట్‌ అయిన సర్పంచ్, అటవీ శాఖ అధికారులు వెంటనే కుంటాల జలపాతం వద్దకు చేరుకున్నారు. మెట్లు దిగుతున్న క్రమంలో యువతిని పట్టుకున్నారు.

అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులకు అప్పగించారు. అక్కడి నుండి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి క్షేమంగా ఉన్నట్లు యువతి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన తండ్రికి మైథిలిని అప్పగించారు పోలీసులు. ఇక.. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే మైథిలీ.. యూట్యూబ్‌ షార్ట్స్‌, ఇన్‌స్టా రీల్స్‌తో సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఆమె వీడియోలే దానికి నిదర్శనమని చెప్పొచ్చు. అయితే.. సడెన్‌గా ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులోనూ హైదరాబాద్‌ నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్‌ జిల్లా కుంటాల జలపాతం వద్దకు ఎందుకు పోయిందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..