Horror Toy: రైతు వినూత్న ఆలోచన.. హర్రర్ బొమ్మ తయారీ.. దాన్ని చూస్తే జంతువులు, పక్షులే కాదు మనుషులకు కూడా..

|

Oct 11, 2021 | 8:39 PM

రైతులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. పంట సాగును సులభతరం చేస్తున్నారు. జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకుంటున్నారు...

Horror Toy: రైతు వినూత్న ఆలోచన.. హర్రర్ బొమ్మ తయారీ.. దాన్ని చూస్తే జంతువులు, పక్షులే కాదు మనుషులకు కూడా..
Toy
Follow us on
 రైతులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. పంట సాగును సులభతరం చేస్తున్నారు. జంతువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకుంటున్నారు. చెట్టుకు సీసా కట్టి దాని పక్కకు ఇనుప కడ్డి కట్టి చంప్పుడు వచ్చేలా చేశారు.  కొద్ది రోజుల క్రితం పంటను రక్షించడానికి హీరోయిన్ బొమ్మలను పెట్టారు. తాజాగా ఓ రైతు కొత్త ఆలోచన చేశాడు.  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన యువ రైతు ముండే సాయికిరణ్ అటవి జంతువులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఈ హర్రర్ బొమ్మను తయారు చేశాడు. దీనికి గాను ఓ సైకిల్ హాండీల్, ఒక డబ్బా, ఒక పైపు , ఒక స్ప్రింగ్‎తో జోడించిన సైకిల్ హాండీల్ డబ్బాకు ఓ పాత అంగిని తొడిగించి బొమ్మను అమర్చి స్టాండును ఏర్పాటు చేశారు.
గాలి వీచినప్పుడల్లా ఈ బొమ్మ తనకు తాను అటు ఇటూ ఊగుతుంది. దీంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పంటలపై వాలే పక్షులు, అటవీ జంతువులు ఈ బొమ్మ ఊగడం చూసి ఉలిక్కిపడి పంట పొలంలోకి రాకుండా దూరంగా ఉంటాయి. దీనికి కేవలం రూ. 900 మాత్రమే ఖర్చు అయిందని, ఎవరికైనా ఈ ఊగే బొమ్మ కావాల్సి ఉంటే తయారు చేసి ఇస్తానని చెపుతున్నాడు యువరైతు సాయికిరణ్.
ఈ బొమ్మ గాలి దిశకు అనువుగా అటూ ఇటూ తిరిగేటపుడు అడవి జంతువుల్ని బెదరగొట్టేలా ఈ బొమ్మ ‘కిర్‌కిర్‌’ శబ్దాలు చేస్తుంది. తనకున్న అయిదెకరాల్లో వేసిన టమాటా, క్యాబేజీ పంటలను రక్షించుకునేందుకు బొమ్మను తయారుచేశానని సాయికిరణ్‌ చెప్పాడు. రెండు నెలలుగా వన్యప్రాణులు పొలంలోకి రావటంలేదంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే ఈ బొమ్మను చూస్తు పక్షలు, జంతువులే కాదు మనుషులు కూడా భయపడతారు. రాత్రి అటూ వెళ్లే వారు నిజంగా దాన్ని దెయ్యం అనుకుంటారు.
Read Also.. Decoration with Crore: అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ.. చూడడానికి తరలొచ్చిన భక్తులు..