Lionel Messi : ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీని హైదరాబాద్‌లో మీటయ్యే చాన్స్ మీ సొంతం

భారత ఫుట్‌బాల్ అభిమానులకు పండుగ వాతావరణం రానుంది. అర్జెంటీనా లెజెండ్‌ లియోనల్‌ మెస్సీ ‘గోట్‌ టూర్‌ టు ఇండియా 2025’ భాగంగా డిసెంబర్‌ 13న హైదరాబాద్‌ రానున్నారు. ఈవెంట్ పూర్తి డీటేల్స్ ఈ కథనం లోపల తెలుసకుందాం పదండి .. ..

Lionel Messi : ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీని హైదరాబాద్‌లో మీటయ్యే చాన్స్ మీ సొంతం
Lionel Messi

Edited By:

Updated on: Nov 11, 2025 | 8:02 PM

భారత ఫుట్‌బాల్ అభిమానులకు ఇదో క్రేజీ చాన్స్. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన అర్జెంటీనా లెజెండ్‌ లియోనల్‌ మెస్సీ హైదరాబాద్‌ రానున్నారు. ‘గోట్‌ టూర్‌ టు ఇండియా 2025’ కార్యక్రమం భాగంగా డిసెంబర్‌ 13న సాయంత్రం 7 గంటలకు భాగ్యనగరాన్ని ఆయన సందర్శించనున్నారు. ఈ ఈవెంట్‌ను ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో లేదా గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. గోట్‌ టూర్‌ ప్రతినిధులు సతద్రు దత్తా, సత్యేంద్రులు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం చేతులమీదుగా అధికారిక పోస్టర్‌ ఆవిష్కరణ జరిగింది. మెస్సీ టీమ్ సంతకాలు చేసిన ఫుట్‌బాల్‌ను ఆయనకు అందజేశారు.

మెస్సీని ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ కార్యక్రమానికి గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రా గ్లోబల్‌ ఇమేజ్‌, పెట్టుబడులు, పర్యాటకం, క్రీడా రంగాలను ప్రోత్సహించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. మెస్సీతో పాటు లూయిస్‌ సువారెజ్‌, రోడ్రిగో డీ పాల్ వంటి స్టార్‌ ఫుట్‌బాలర్లు కూడా ఈ టూర్‌లో పాల్గొననున్నారు. ఆ సాయంత్రం 7 వర్సెస్‌ 7 సెలబ్రిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌, యువ ఆటగాళ్ల కోసం మెస్సీ మాస్టర్‌క్లాస్‌, పెనాల్టీ షూటౌట్లు, మ్యూజిక్ కన్సెర్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు ఉంటాయి. టికెట్లు త్వరలో ‘డిస్ట్రిక్ట్‌’ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. టికెట్లు క్షణాల్లోనే సేల్ అవుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..