కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మంటలు చల్లారడం లేదు. మూడో రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటు కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో పాటు 12 మందిపై కేసు నమోదు చేశారు. సంజయ్‌పై నాన్‌బెయిల్‌బుల్ కేసు పెట్టారు. ప్రభుత్వ వాహనం ధ్వంసం, అనుమతి లేకుండా కలెక్టర్ ముట్టడికి యత్నించి, భారీకేడ్లను తోసేసినందుకు వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలకు కారణమైన మరో 25 మందికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నిన్న అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. ఆతర్వాత కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేశారు. మరికొందరు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి దూకేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తం కావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. నిన్న జరిగిన ఈ ఘటనలపై పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు.
కామారెడ్డిలో సెక్షన్ 30 అమల్లో ఉందని అన్నారు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను కొంత మంది కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు.
#UPDATE | A case has been registered against Telangana BJP chief Bandi Sanjay. He is booked under the PDPP act and 353 section. The case is under investigation: B Srinivas Reddy, SP Kamareddy https://t.co/kj6WbQQYwT
— ANI (@ANI) January 7, 2023
ఇదిలాఉంటే.. కామారెడ్డి శివారులో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలనీ రైతుల ఆందోళన నిర్వహిస్తున్నారు.. పంట పొలాల వద్ద నిరసన తెలుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..