Telangana: గ్రామస్తులకు బంపర్ ఆఫర్.. ఏకంగా ఊరికి బాండ్ పేపర్ రాసిచ్చిన అభ్యర్థి..!

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.. వింత హామీలతో అభ్యర్థులు ప్రజలను నోరెళ్ళ బెట్టేలా చేస్తున్నారు.. ములుగు జిల్లాలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ ఫ్రీ వైఫై, టీవీ చానల్స్ ప్రసారాలు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తున్నారు. వట్టి మాట కాదు.. ఒట్టు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు..

Telangana: గ్రామస్తులకు బంపర్ ఆఫర్.. ఏకంగా ఊరికి బాండ్ పేపర్ రాసిచ్చిన అభ్యర్థి..!
Sarpanch Candidate Promised

Edited By: Balaraju Goud

Updated on: Dec 05, 2025 | 3:06 PM

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.. వింత హామీలతో అభ్యర్థులు ప్రజలను నోరెళ్ళ బెట్టేలా చేస్తున్నారు.. ములుగు జిల్లాలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ ఫ్రీ వైఫై, టీవీ చానల్స్ ప్రసారాలు ఉచితంగా అందిస్తానని హామీ ఇస్తున్నారు. వట్టి మాట కాదు.. ఒట్టు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు..

తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ ప్రసారాలు ఉచితంగా ఇస్తామని అభ్యర్థి హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. ఈ మేజర్ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ నేపద్యంలో పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుడ్ల శ్రీలత, BRS పార్టీ బలపరిచిన కాకులమర్రి శ్రీలత హోరీగా పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ధనలక్ష్మి పోటీ చేస్తున్నారు.

BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి వినూత్న హామీలతో కూడిన బాండ్ పేపర్ రాసివ్వడం ఊరంతా చర్చగా మారారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు.. గ్రామస్థులకు తెలియజేస్తానని అందులో పేర్కొన్నారు..గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు. ఇవన్నీ ఒకెత్తయితే ఊరంతా ఉచితంగా వైఫై, టివి చానల్స్ ప్రసారాలు అందిస్తానని ప్రకటన చేశారు. ఏకంగా బాండ్ పేపర్ రాసి ఇవ్వడం చర్చకు దారి తీసింది. మరి జనం ఈ ఉచిత హామీలకు జై కొడతారా లేదా..! వేసి చూడాలి..!

వీడియో చూడండి ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..