Hyderabad: ఏం తిన్నా కోమాలోకి పోయినట్టే..! సీన్ చూడగా పోలీసులకే మైండ్ బ్లాంక్

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా ప్రాంతంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గోదాంపై సౌత్ ఈస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి చేసి నిర్వాహకుడు మొహమ్మద్ ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి మీరూ లుక్కేయండి మరి.

Hyderabad: ఏం తిన్నా కోమాలోకి పోయినట్టే..! సీన్ చూడగా పోలీసులకే మైండ్ బ్లాంక్
Hyderabad

Updated on: Jun 04, 2025 | 11:10 AM

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీరాయుళ్ల మీద కొరఢా ఝళిపిస్తున్నా.. ఏమాత్రం కల్తీ దందా ఆగట్లేదు. రోజుకో దగ్గర కల్తీ భాగోతం బయటపడుతూనే ఉంది. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ బండ్లగూడాలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన పేస్ట్‌ను సీజ్‌ చేశారు. పటేల్‌నగర్‌లో మహమ్మద్ ఫైసల్‌ ఇంట్లో స్థానిక పోలీసులతో కలిసి సౌత్‌ ఈస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదాలు చేశారు. ఎఫ్‌కే ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతో హానికరమైన రసాయనాలను ఉపయోగించి కల్తీ అల్లంవెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ పేస్ట్‌ టైటానియమ్‌ డైఆక్సైడ్‌, టర్మరిక్‌ పౌడర్‌తో కలిపి తయారు చేస్తున్నారని, ఇవి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించార. ఈ దాడుల్లో 870 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌, 4 కిలోల టైటానియమ్‌ డైఆక్సైడ్‌, 16 కిలోల మోనో సైట్రేట్‌, 4 కిలోల టర్మరిక్‌ పౌడర్‌ స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వివరించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి