AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేక్ డిగ్రీతో అమెరికాకు.. కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అసలు మ్యాటర్ తేలింది..

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విదేశాలకు పంపుతున్న ఇద్దరు నిందితులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ లు, నకిలీ యూనివర్సిటీ స్టాంపులు సెల్ ఫోన్ లు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్ ఏసిపి శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు.

ఫేక్ డిగ్రీతో అమెరికాకు.. కట్ చేస్తే, రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అసలు మ్యాటర్ తేలింది..
Fake Degree Racket
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2025 | 11:32 AM

Share

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేసి విదేశాలకు పంపుతున్న ఇద్దరు నిందితులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ లు, నకిలీ యూనివర్సిటీ స్టాంపులు సెల్ ఫోన్ లు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్ ఏసిపి శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ హస్తినాపురం ప్రాంతానికి చెందిన కాతూజు అశోక్ నకిలీ ధనలక్ష్మి ఓవర్సీస్ అబ్రాడ్ స్టడీ, వీసా కన్సల్టెన్సీ నడుపుతున్నాడు. అయితే ఇతనికి 2021 లో కేరళకు చెందిన వ్యక్తి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తయారు చేసి విదేశాలకు పంపే వారితో పరిచయం ఏర్పడింది. విదేశాల్లో చదివాలనే కోరిక ఉండి అకాడమిక్ లో బలహీనంగా ఉన్న వారిని టార్గెట్ చేసేవాడు.. తన కన్సల్టెన్సీ కి వచ్చే విద్యార్థులకు అశోక్ ఒకరి నుండి 80 నుండి లక్ష వరకు వసూలు చేసి అందులో 30 వేల రూపాయలు కేరళ వ్యక్తికి ఇచ్చేవాడు. 30 వేలు తీసుకున్న కేరళ వ్యక్తి నకిలీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ బ్యాంక్ స్టేట్మెంట్ తయారు చేసి విదేశాలకు పంపుతున్నాడు.

అయితే అదే క్రమంలో నల్గొండ ప్రాంతానికి చెందిన ఫకీరు గోపాల్ రెడ్డి ఆగస్టు 2021 లో అశోక్ కు 80 వేల రూపాయలు ఇచ్చి తమిళనాడుకు చెందిన మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సి కంప్యూటర్ సైన్స్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ 2015-2018 లో పూర్తి అయినట్లు పొందాడు. దాని సహకారంతో గోపాల్ రెడ్డికి యూఎస్ఏ వెబ్ స్టార్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. రెండు సంవత్సరాల కాలేజీ ఫీజుకు గాను 28.000 డాలర్స్ ఇండియాలో 28 లక్షలు కట్టి 2023 యూఎస్ఏ లో 15 నెలలు చదువుకున్నాడు. అతను గత ఐదు నెలల క్రితం మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో డల్లాస్ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ ప్రాసెస్‌లో యూఎస్ఏ అధికారులు గోపాల్ రెడ్డి స్టేటస్ ను SEVIS (student and exchange visitors information system) వెబ్సైట్ లో గల వెబ్సెటర్ యూనివర్సిటీలో చూడగా అతని స్టేటస్ ఇన్ అక్టివ్ గా చూపించింది. దీంతో అతను తిరిగి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ చేయగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బండారం బయటపడింది.

అశోక్ 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపు 15 మంది విద్యార్థులను పంపించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు అశోక్ తో పాటు గోపాల్ రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అయితే.. నిందితుల నుంచి మధురై కామరాజ్ యూనివర్సిటీ కి చెందిన 13 నకిలీ మెమోలు, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నాలుగు నకిలీ డిగ్రీ మార్కుల సర్టిఫికెట్ లు వివిధ కంపెనీలకు బ్యాంకులకు చెందిన స్టాంపులు, సెల్ ఫోన్ లు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..