Telangana Floods: తెలంగాణను కుదిపేసిన వరదలు.. మొత్తం 49 వంతెనలు ధ్వంసం

| Edited By: Janardhan Veluru

Jul 29, 2023 | 1:06 PM

తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల రోడ్లు, ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో మొత్తంగా 49 బ్రిడ్జీలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే చాలావరకు రహదారులు కోతకు గురైనట్లు పేర్కొన్నారు. ఇంకొన్నింటపై గుంతలు పడ్డాయని పేర్కొన్నారు.

Telangana Floods: తెలంగాణను కుదిపేసిన వరదలు.. మొత్తం 49 వంతెనలు ధ్వంసం
Bridge Collapse in Telangana
Follow us on

తెలంగాణలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల రోడ్లు, ఇళ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో మొత్తంగా 49 బ్రిడ్జీలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే చాలావరకు రహదారులు కోతకు గురైనట్లు పేర్కొన్నారు. ఇంకొన్నింటపై గుంతలు పడ్డాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం వరకూ కూడా అనేక ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగింది. చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. జాతీయ రహదారులకు సంబంధించి 11 చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర రహదారుల విషయంలో 38 ప్రాంతాల్లో బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 15 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

అలాగే జగిత్యాల జిల్లాలో 10 బ్రిడ్జిలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 , ఆదిలాబాద్‌లో 3 వంతెనలు దెబ్బతిన్నాయి. ఇంకా జనగామ, మంచిర్యాల, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లల్లో చూసుకుంటో 2 చొప్పున బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 250 ప్రాంతాల్లో రహదారులపై వరద ప్రవహించినట్లు అధికారులు చెప్పారు. అదిలా ఉండగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని రహదారుల తాత్కాలిక మరమ్మతుల కోసం క్షేత్రస్థాయిలో ఉన్న నిధులు వాడుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దాదాపు రూ.120 కోట్లు వాడుకోవాలని సూచించింంది. ఒకవేళ భారీ మరమ్మతులు ఉంటే రాష్ట్రస్థాయికి ప్రతిపాదనలు పంపాలని కోరింది. అలాగే జాతీయ రహదారుల మరమ్మతు కోసం రూ.29 కోట్లు అవసరమని ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి