Corona Virus: శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్‌లో కరోనా కలకలం… 34 మంది విద్యార్థులకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు

|

Dec 29, 2021 | 9:04 PM

Corona Virus: హైదరాబాద్ నార్శింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన నిన్న 17 మంది విద్యార్థులు పడగా..

Corona Virus: శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్‌లో కరోనా కలకలం... 34 మంది విద్యార్థులకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు
Students Test Covid 19 Posi
Follow us on

Corona Virus: హైదరాబాద్ నార్శింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన నిన్న 17 మంది విద్యార్థులు పడగా.. నేడు మరో 17 మందికి కరోనా వైరస్ నిర్దారణ అయింది. దీంతో కాలేజీ క్యాంపస్ లో కరోనా వైరస్ సోకిన మొత్తం విద్యార్థుల సంఖ్య 34 కి చేరింది. ఇంకా 266 విద్యార్థుల రిజల్ట్ రావాల్సి ఉందని తెలుస్తోంది. ఈ కాలేజీలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు.

ఈ కాలేజీ క్యాంపస్ లో ఎక్కువగా నాన్ లోకల్ విద్యార్థులే చదువుతున్నాట్లు.. హైదరాబాద్ సహా వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువమంది ఉంటారని తెలుస్తోంది. విద్యార్థులు క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లారు.  అయితే తిరిగి క్యాంపస్ కు వచ్చిన విద్యార్థులలో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో క్యాంపస్ స్టూడెంట్ కు వెంటనే టెస్టులను నిర్వహించారు. మంగళవారం కొందరి విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. నేడు మరికొందరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌గా తేలిన కొంతమంది స్టూడెంట్స్ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోగా..  మిగిలిన విద్యార్థులను కాలేజ్ యాజమాన్యం ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పాజిటివ్‌గా తేలిన కొంత మంది విద్యార్థులు క‌రోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే కరోనావైరస్ సోకిన విద్యార్థులు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని.. లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

Also Read:  మాతృత్వ మధురిమలు గుర్తుండిపోయేలా.. తల్లి పాలతో నగల తయారీ.. అసలేంటంటే..