Special Trains: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే.. రైలు సర్వీసులను పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఎస్‌సీఆర్ మంగళవారం ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ – తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య నడవనున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని.. అదేవిధంగా తిరుమల తిరుపతికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు.
07643 హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ట్రైన్స్ నడవనున్నాయి.
07644 తిరుపతి – హైదరాబాద్ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.
07612 కాచిగూడ – నర్సాపూర్ మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో రైళ్లు నడుస్తాయి.
07613 నర్సాపూర్- కాచ్చిగూడ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
07614 తిరుపతి- కాచిగూడ మధ్య జూలై 27, ఆగస్ట్ 3, 10, 17, 24, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ మేరకు ఈ ట్రైన్స్ హాల్టింగ్ వివరాలను సైతం పంచుకుంది. ఈ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఆగుతాయో కింద ఇచ్చిన ఫొటోలో చెక్ చేసుకోండి..
30 Weekly Special Trains between Various Destinations @drmgtl @drmhyb @drmsecunderabad @VijayawadaSCR pic.twitter.com/746bkK3cvB
— South Central Railway (@SCRailwayIndia) July 19, 2022
దీంతోపాటు వలన్‌కన్ని ఫెస్టివల్ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే లోకమన్య తిలక్ – నాగపట్నం మధ్య నాలుగు సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు ఆగస్టు 26, 28, సెప్టెంబర్ 06, 08న ఉంటాయని తెలిపింది.
#Velankani Festival Special Trains pic.twitter.com/i8ETHGYBqC
— South Central Railway (@SCRailwayIndia) July 19, 2022
మరిన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తలు..