Telangana: చేపల వల బరువెక్కింది.. పైకి లాగగా చిక్కింది చూసి జాలరి స్టన్.!

|

Feb 26, 2024 | 1:54 PM

మత్స్యకారులు ఒక్కసారి సముద్రంలోకి వెళ్లారంటే.. కచ్చితంగా వల బరువెక్కాల్సిందే. బ్రతుకు జట్కా బండిని నడిపించేందుకు బోలెడన్ని చేపలు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఇదిలా ఉంటే.. అప్పుడప్పుడూ జాలర్ల వలకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అవి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం.

Telangana: చేపల వల బరువెక్కింది.. పైకి లాగగా చిక్కింది చూసి జాలరి స్టన్.!
Rare Fish
Follow us on

మత్స్యకారులు ఒక్కసారి సముద్రంలోకి వెళ్లారంటే.. కచ్చితంగా వల బరువెక్కాల్సిందే. బ్రతుకు జట్కా బండిని నడిపించేందుకు బోలెడన్ని చేపలు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఇదిలా ఉంటే.. అప్పుడప్పుడూ జాలర్ల వలకు అరుదైన చేపలు చిక్కుతుంటాయి. అవి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. పైగా దేశమంతటా నలుమూలల ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. తాజాగా తెలంగాణలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. రోజూలానే ఓ జాలరి స్థానికంగా ఉన్న ఓ జలాశయంలోకి చేపల వేటకు వెళ్లాడు. నీళ్లలోకి వల వేయగా.. కాసేపటికి అది బరువెక్కడంతో తెగ సంబరపడ్డాడు. కట్ చేస్తే..

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడి పంట పండింది. మహ్మద్‌నగర్‌ మండలం హాసన్‌పల్లి గ్రామానికి చెందిన బెస్త లక్ష్మణ్‌ రోజూ మాదిరిగానే పది రోజుల క్రితం నిజాంసాగర్ జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలానే వలకు కొన్ని చేపలు చిక్కితే.. వాటిని పట్టుకుని ఇంటికి వెళ్లాలని అనుకున్నాడు. అయితే అనూహ్యంగా ఆ రోజు అతడి వలకు ఏకంగా 21 కిలోల భారీ బొచ్చ రకం చేప చిక్కింది. ఆ చేప వేలంలో రూ. 3 వేలు పలకడం విశేషం. కాగా, రిజర్వాయర్‌లో ఇలాంటి అరుదైన చేపలు చిక్కడం చాలా తక్కువ అని స్థానికులు అంటున్నారు.

ఇది చదవండి: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందే.. పూర్తి వివరాలు..