నిర్మల్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతుంది. ఈ వ్యాధి మేకలకు వేగంగా సోకుతుంది. భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన కదం దత్తురాంకు చెందిన 20 మేకలు ఒకే రోజు మృతి చెందడంతో స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. మృతి చెందిన మేకలకు కంటైజేస్ క్యాప్ట్రెన్ ఫ్లూరో నిమోనియా (సీసీపీఎన్) సోకి చనిపోయినట్లు తెలుస్తుంది. మేక మందల్లో ఉండే పెద్ద మేకలు చొంగ కారుస్తూ.. ఉన్నట్టుండి చనిపోతున్నాయి. ఒకేసారి 20 మేకలు మృతి చెందడంతో సుమారు రూ. 2లక్షల మేర నష్టం వాటిల్లిందని దత్తురాం రోధించాడు. ఈ వ్యాధి నివారణకు సరైన మందులు లేవని పశువైద్యులు చెబుతున్నారు. దీంతో మేకల మంద ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. యేళ్ల తరబడి కాపాడుకుంటున్న మేకలు ఇలా కళ్లముందే రాలిపోతుంటే ఏం చేయాలో పాలుపోక అవస్థలు పడుతున్నారు. దాదాపు ఆ గ్రామంలోని మేకల మందలు కలిగిన అందరి రైతులు పరిస్థితి దాదాపు ఈ విధంగానే ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.