Vehicle Checking: వాహన తనిఖీలో పట్టుబడ్డ బైక్.. చెక్ చేస్తే మైండ్ బ్లాంక్ చలాన్లు.. బండి వదిలి పరారైన వాహన దారుడు..!

|

Dec 07, 2021 | 11:44 AM

Vehicle Checking: హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది.

Vehicle Checking: వాహన తనిఖీలో పట్టుబడ్డ బైక్.. చెక్ చేస్తే మైండ్ బ్లాంక్ చలాన్లు.. బండి వదిలి పరారైన వాహన దారుడు..!
Bike Challan
Follow us on

Vehicle Checking: హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కావడంతో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా ప్రతి రోజు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయినా కానీ మందు బాబులు మందు తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒక రోజే మద్యం తాగి వాహనాలు నడుపుతూ రెండు చోట్ల నలుగురు మృతి చెందారు.

దీంతో నగరం వ్యాప్తంగా ప్రధాన కూడళ్ళలో వాహన తనిఖీ లతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు అలీ కేఫ్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా AP23M9895 వాహనాన్ని పట్టుకుని చెక్ చేశారు. ఆ బైక్‌పై ఉన్న చలానా లు చూసి పోలీసులే బిత్తర పోయారు. దానిపై 179 చనాలాకు 42,475/- రూపాయలు ఉండడంతో పోలీస్ లు ఆశ్చర్య పోయారు. అతని వాహనాన్ని పట్టుకుని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. బండి వదిలి పరారయ్యాడు వాహనదారుడు. భారీ చాలాన్ ఉండడంతో బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు.

Also read:

Truecaller: ట్రూకాలర్‌ కొత్త ఫీచర్లు !! వీడియో కాల్‌ రికార్డింగ్‌ చేసే ఆప్షన్‌ !! వీడియో

IND vs SA: టెస్ట్ కెప్టెన్సీలో ఆయనే నంబర్ వన్.. అక్కడ సిరీస్ గెలిస్తే చరిత్రలో నిలుస్తాడు: టీమిండియా మాజీ దిగ్గజ బౌలర్

Viral Wedding Video: ఇదేం తమాషారా నాయనా.. కంగారు పడ్డ వధూవరులు.. అసలు సంగతి తెలిసి అంతా షాక్..