ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య..!

ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ పోయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో అశోక్(17) అనే యువకుడు తల్లి జయమ్మతో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ కూలి పనులకు వెళ్లేవారు. అయితే.. ఇటీవల దాచుకున్న డబ్బులతో ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ కొనుక్కున్నాడు. ఏమయిందో ఏమో కానీ.. ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. తల్లి తిడుతుందని భయమో.. లేక ఫోన్ పోయిందని మనస్తాపమో కానీ.. ఇంట్లో ఎవరూ […]

ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య..!

Edited By:

Updated on: May 14, 2019 | 6:51 PM

ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న స్మార్ట్ ఫోన్ పోయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం ఎస్సీ కాలనీలో అశోక్(17) అనే యువకుడు తల్లి జయమ్మతో కలసి ఉంటున్నాడు. ఇద్దరూ కూలి పనులకు వెళ్లేవారు. అయితే.. ఇటీవల దాచుకున్న డబ్బులతో ఓ ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ కొనుక్కున్నాడు. ఏమయిందో ఏమో కానీ.. ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. తల్లి తిడుతుందని భయమో.. లేక ఫోన్ పోయిందని మనస్తాపమో కానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడ్‌తో కుడిచేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు. మళ్లీ చీరతో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లి జయమ్మ కన్నీరుమున్నీరయ్యింది.