Telangana: అవకతవకలకు పాల్పడితే ఔట్.. ఏకంగా 165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్‌..

|

Oct 12, 2022 | 12:39 PM

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపింది.

Telangana: అవకతవకలకు పాల్పడితే ఔట్.. ఏకంగా 165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్‌..
Telangana Private Hospital (Representative image)
Follow us on

నిబంధనలు పాటించకుండా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. అవకతవకలు పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర చేసింది. ఆకస్మిక తనిఖీలు చేస్తూ టెర్రర్ పుట్టిస్తోంది. రూల్స్ సరిగ్గా పాటించని 165 ఆస్పత్రులను సీజ్‌ చేసింది. మరో 106 ఆస్పత్రులకు ఫైన్ వేసి.. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది. ఆస్పత్రులు మాత్రమే కాదు.. క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు సహా మొత్తం 3,810 చోట్ల వైద్యారోగ్య శాఖ తనిఖీలు చేసింది. ఇందులో నిబంధనలు సరిగ్గా పాటించని 1,163 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. అధికారులు మంగళవారం ఈ డీటేల్స్ వెల్లడించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మెడికల్ మాఫియా ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే సీజ్ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 హాస్పిటల్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 54 హాస్పిటల్స్‌లో రైడ్స్ చేయగా.. అందులో దాదాపు 70 శాతం ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీంతో వాటిని సీజ్ చేశారు.

జిల్లాలవారీగా సీజ్ చేసిన ఆస్పత్రుల సంఖ్య: 

  • నల్గొండ: 17
  • సంగారెడ్డి: 16
  • భద్రాద్రి కొత్తగూడెం: 15
  • హైదరాబాద్‌: 10
  • రంగారెడ్డి: 10

జిల్లాలవారీగా నోటీసులు జారీ చేసిన ఆస్పత్రుల సంఖ్య: 

  • హైదరాబాద్‌: 274
  • కరీంనగర్‌: 124
  •  రంగారెడ్డి : 107

ప్రస్తుతం నోటీసుల జారీ చేసిన ఆస్పత్రుల నుంచి వివరణ వచ్చిన అనంతరం మరోసారి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడినా, అధిక డబ్బులు వసూలు చేసినా.. సరైన సేఫ్టీ పద్దతులు పాటించపోయినా, లైసెన్సులు లేకుండా ఆస్పత్రులు నిర్వహించినా, నకిలీ సర్టిఫికెట్లపై ప్రాక్టిస్ చేస్తున్నా… కఠిన చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..