Stray Dogs: జాతరలో భక్తులపై కుక్క దాడి.. 16 మందికి గాయాలు.. అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆరోపణలు

కొత్తగూడ మండలం లో గుంజేడు గ్రామ శివారులో ఉన్న గుంజేడు ముసలమ్మ దేవాలయం పరిధిలో ప్రతి శుక్రవారం జాతర జరుగుతుంది. అటవీ ప్రాంతం కావడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో భక్తులు పక్క మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు.

Stray Dogs: జాతరలో భక్తులపై కుక్క దాడి.. 16 మందికి గాయాలు.. అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆరోపణలు
Stary Dog

Updated on: May 20, 2023 | 7:10 AM

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గుంజేడు ముసలమ్మ దేవాలయ ఆవరణలో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రతీ శుక్రవారం జరిగే గుంజేడు జాతరకు తరలిన భక్తులపై ఓ కుక్క విచక్షణారహితంగా దాడి చేయడంతో దాదాపు 16 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. కొత్తగూడ మండలం లో గుంజేడు గ్రామ శివారులో ఉన్న గుంజేడు ముసలమ్మ దేవాలయం పరిధిలో ప్రతి శుక్రవారం జాతర జరుగుతుంది. అటవీ ప్రాంతం కావడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో భక్తులు పక్క మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తుంటారు. అమ్మవారికి మొక్కులు సమర్పించి, దీవెనలు తీసుకుని వెళ్తుంటారు. ఎప్పటిలాగే పిల్లా పాపలతో గుంజేడు జాతరకు వెళ్లిన పలు కుటుంబాలపై ఓ కుక్క దాడి చేసింది.

మహిళలు, పిల్లలే లక్ష్యంగా దాదాపు 16 మందికి పైగా దాడి చేసి గాయపరించింది. సరదాగా గడపడానికి వచ్చిన భక్తులు భయంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గాయపడిన వారిని చికిత్స కోసం తరలించారు. దేవాలయ ఆవరణలో కనీస సౌకర్యాలు సైతం లేవని భక్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో సంబందిత అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గాయపడిన భక్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి ఆలయ అభివృద్ధికి, ఆలయ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Reporter : Peddeesh Kumar

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..