పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత! ఏం జరిగిందంటే

రోడ్డు పక్కన పానీపూరి తిన్న 15 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు, నాణ్యతలేని పదార్థాల వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు..

పానీపూరి లవర్స్‌కు షాక్.. ఒకేసారి 15 మందికి తీవ్ర అస్వస్థత! ఏం జరిగిందంటే
Pani Puri Food Poisoning In Gadwal

Edited By:

Updated on: May 28, 2026 | 9:50 AM

జోగులాంబ గద్వాల, మే 28: రోడ్డు పక్కన అమ్మే పానీపూరి తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకుంది. అయిజ పట్టణంలో కొంతమంది స్నేహితురాళ్ళు సాయంకాలం స్నాక్స్ తిందామని బయటకు వచ్చారు. పాత బస్టాండ్ వద్ద ఓ పానీపూరి బండి కనిపించింది. దీంతో అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అక్కడ బండి వద్ద ఫ్రెండ్స్ అంత సరదాగా పానీపూరి తిన్నారు. తిన్న తర్వాత 15 మంది ఒక్కొక్కరికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆహార కల్తీ కారణంగా వైద్యులు పిల్లల తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో అస్వస్థతకు కారణం పానీపూరి అనే పేరెంట్స్ నిర్ధారణ కు వచ్చారు. కలుషిత నీరు, నాణ్యత లేని పదార్ధాలతో పానీపూరి తయారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స అనంతరం బాధిత బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు పానీపూరి బండి వద్దకు చేరుకొని విచారించారు. ముందు జాగ్రత్తగా పానీపూరి బండి ని అక్కడి నుంచి తొలగించి స్టేషన్ కు తరలించారు. 15 బాలికల అస్వస్థతకు గల కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఘటనతో ఒక్కసారిగా అయిజా పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ కేంద్రాలపై వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ ఆహారం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us