Watch Video: నడిరోడ్డుపై బరితెగించిన ఆకతాయిలు.. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి..!
హైదరాబాద్ మహానగర శివార్లలో పోకిరీలు బరితెగించారు. అర్ధరాత్రి వేళ రోడ్డుపై వెళ్తున్న ఒక కారును బైక్‌లపై వెంబడిస్తూ, అందులోని ప్రయాణికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు ప్రయాణిస్తున్న కారు డ్యాష్ క్యామ్‌లో ఈ ఆందోళనకర దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘాట్‌కేసర్ పరిధిలో రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న కార్లను టార్గెట్ చేస్తూ, వాటిని అడ్డగించడం, దాడులకు ప్రయత్నించడం ఈ పోకిరీల శైలిగా మారింది. ముఖ్యంగా సదరు కారులో మహిళలు ఉన్నారని గమనించిన ఆకతాయిలు, మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు. బైక్‌లను కారుకు అడ్డంగా తిప్పుతూ, కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. పోకిరీల ఈ అగడాలు, భీకర ప్రవర్తన చూసి కారులో ఉన్న చిన్నారులు భయంతో గుక్కపెట్టి ఏడ్చారు.
తమకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని, భయానక దృశ్యాలను వివరిస్తూ కారులో ప్రయాణించిన ఒక యువతి సోషల్ మీడియా వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. ప్రధాన రహదారి రాత్రి వేళల్లో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. “నడిరోడ్డుపై ఇంతలా రెచ్చిపోతున్నా పట్టించుకునేవారు లేరా?” అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యాష్ క్యామ్ ఆధారంగా నిందితుల బైక్ నంబర్లను గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఘాట్‌కేసర్ పరిధిలో రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని బాధితులతో పాటు నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..