సర్కార్ వారి ఆసుపత్రికే కన్నం వేసిన కేటుగాళ్లు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు..
రోజు రోజుకు దొంగలు తెలివిమీరుతున్నారు. ఇప్పటివరకు ఇళ్లకే కన్నాలేసే కేటుగాళ్లు ఇప్పుడు గుడి బడి తేడాలేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. చివరకు ఆసుపత్రులను కూడా వదలడం లేదు.
రోజు రోజుకు దొంగలు తెలివిమీరుతున్నారు. ఇప్పటివరకు ఇళ్లకే కన్నాలేసే కేటుగాళ్లు ఇప్పుడు గుడి బడి తేడాలేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. చివరకు ఆసుపత్రులను కూడా వదలడం లేదు దుండగులు. తాజాగా సర్కార్ ఆసుపత్రిలో లక్షల విలువచేసే యంత్రం మాయం కావడంతో అధికారులే అవాక్కయ్యారు. అదేంటి ప్రభుత్వ ఆస్పత్రిలో చోరీ అనుకుంటున్నారా..? అది కూడా విలువైన యంత్రం కనిపించకుండా పోవటం వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ, ఇది నిజమే..! ఈ ఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.
వరంగల్ నగరంలోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సుమారు 14 లక్షల విలువచేసే లాపరో స్కొప్ యంత్రం కనిపించకుండా పోయింది. స్త్రీ సంబంధిత వ్యాధులను గుర్తించడానికి 2014లో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఆస్పత్రి థియేటర్‌లో ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది…కొంతకాలం బాగానే పని చేసినా.. ఆ తర్వాత యంత్రంలో రిపేర్ రావడంతో వాడడం మానేసారు వైద్యులు. 2019 వరకు ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్నా ఆ యంత్రం ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఇటీవల ఆస్పత్రిలోనే స్త్రీ వైద్య నిపుణురాలు పేద ప్రజలకు చికిత్స అందిస్తామని థియేటర్‌లోని యంత్రం గురించి ఆరా తీయగా ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆస్పత్రి అధికారులు తెలుపగా విచారణకు ఆదేశించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Hyderabad Water Supply Alert : హైదరాబాద్ లో మంచినీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే.