ఎన్నికల నామినేషన్ దొంగలకు వరంలా మారింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీలతో వెళ్లడంతో దొంగల తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేల సంఖ్యలో జన సమీకరణ చేయడంతో చాలా మంది బస్తీలోని వాసులు సైతం నేతల నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇదే అదునుగా చూసుకున్న కొంతమంది పోకిరీలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. నేతల నామినేషన్ ర్యాలీలను అడ్డాగా చేసుకుని డబ్బులు దొంగలిస్తున్నారు.
సాధారణంగా నామినేషన్‌కి చివరి రోజు కావటంతో ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు నేతలు ప్రయత్నాలు చేశారు. తమ నివాసం నుండి నామినేషన్ కేంద్రాల వరకు భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్న నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కార్యకర్తల జేబులను కేంద్రంగా చేసుకొని పలువురు పోకిరీలు జేబుల్లో చేయి పెట్టి మరి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే, అంత భారీ జనంలో.. ఎవరు ఏ జోబు కొట్టేశారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాలలో జన సమీకరణ కోసం స్థానికంగా ఉన్న ప్రజలను డబ్బులు ఇచ్చి మరి ర్యాలీలో పాల్గొనేలా చేస్తున్నారు. ఇదే అదునుగా చూసుకుని పలువురుని పోకిరీలు తమ చేతులకు పని చెబుతూ నేతల జేబులోకి దూరుస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుసుకుని అభ్యర్థులు సైతం అవాకవుతున్నారు.
గత రెండు రోజుల్లోనే హైదరాబాద్ పరిధిలో 36 పిట్ పాకెట్ కేసులు నమోదు అయ్యాయి అంటే దొంగల ఏ స్థాయి లో రెచ్చిపోయారో అర్ధం చేసుకోవచ్చు. తమ నేతలు ఇచ్చిన డబ్బును పంచి పెట్టేవారు కొందరి జేబులు గుల్ల కాగా.. మరి కొందరివి సొంత నగదు, ఆభరణాలు చోరికి గురి అయ్యాయి. అభిమనంతో వచ్చి జేబులు ఖాళీ కావడంతో షాక్ కు గురయ్యారు కార్యకర్తలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..