Nirmal District: సెంచరీ దాటిన బామ్మ.. ఆమె బలగం ఎంతో తెలుసా..?

ఈ రోజుల్లో 60 ఏళ్ల జీవితం కూడా కష్టంగా మారుతున్న తరుణంలో నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన మారవేణి గంగవ్వ శతాయుష్కురాలిగా నిలిచారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టిన గంగవ్వకు కుటుంబ సభ్యులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

Nirmal District: సెంచరీ దాటిన బామ్మ.. ఆమె బలగం ఎంతో తెలుసా..?
Gangavva And Family

Edited By:

Updated on: Jan 23, 2026 | 8:31 PM

మనిషి జీవిత కాలంలో 60 సంవత్సరాలు బ్రతకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఓ బామ్మ సెంచరీ జీవిత కాలం పూర్తి చేసుకుని 101 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఆ బామ్మ ఎవరో ఆమె స్వస్థలం ఎక్కడ అనుకుంటున్నారా. కొయ్య బొమ్మల ఖిల్లా నిర్మల్ జిల్లా దస్తురబాద్ గ్రామమే.

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన మారవేణి గంగవ్వ అనే వృద్ధురాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగుపెట్టడంతో వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒకచోట చేరి బామ్మకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగవ్వకు మొత్తం తొమ్మిది మంది సంతానం… కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు ,మనుమరాండ్లు,మనుమలు అంతా కలిసి మొత్తం 92 మంది ఉంటారు. మహాబలగం లాంటి తమ కుటుంబ సభ్యులు తమ బామ్మ,తల్లి,అత్తమ్మ అయిన గంగవ్వ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో వారంతా కలిసి ఒకచోట చేరి బామ్మకు అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలు జరిపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.