Telangana Corona Update: తెలంగాణాలో తగ్గుముఖం పట్టిన కరోనా.. గత 24గంటల్లో 118కొత్త కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 118 కేసులు నమోద్యయ్యాయని దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య..

Telangana Corona Update: తెలంగాణలో కరోనా వైరస్ ఉదృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 118 కేసులు నమోద్యయ్యాయని దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,94,587కి చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటెన్ లో తెలిపింది. ఇక గడిచిన 24గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,601కి చేరింది. ఈ వైరస్ బారినుంచి నిన్న ఒక్కరోజే 264 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 2,90,894కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,092 ఉండగా వీరిలో 723 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. గత 24గంటల్లో 17,686 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించామని చెప్పింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనాపరీక్షల సంఖ్య 78,79,047కి చేరిందని వైద్య సిబ్బంది తెలిపింది.
Also Read: మరికొన్ని గంటల్లో సీతమ్మ ఆవిష్కరించనున్న ఆశల చిట్టా పై తెలుగు రాష్ట్రాలు ఆశలు