AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొత్తగా పెళ్లైన జంటకు బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌!… మీరట్‌ ఘటన తలుచుకుని వరుడు షాక్‌!!

పెళ్లి అనగానే బంధుమిత్రులు, స్నేహితులు బహుమతులు అందించడం ఓ తంతు. స్తోమతకు తగ్గట్టు రకరకాల గిఫ్టులు సమర్పించుకుంటూ వారి పట్ల తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటారు. అయితే కొత్తగా పెళ్లైన ఓ జంటకు అరుదైన బహుమతి అందింది. వరుడి స్నేహితులు బ్లూ డ్రమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది చూసి పెళ్లికొడుకు...

Viral Video: కొత్తగా పెళ్లైన జంటకు బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌!... మీరట్‌ ఘటన తలుచుకుని వరుడు షాక్‌!!
Blue Drum Gift
K Sammaiah
|

Updated on: Apr 24, 2025 | 6:03 PM

Share

పెళ్లి అనగానే బంధుమిత్రులు, స్నేహితులు బహుమతులు అందించడం ఓ తంతు. స్తోమతకు తగ్గట్టు రకరకాల గిఫ్టులు సమర్పించుకుంటూ వారి పట్ల తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటారు. అయితే కొత్తగా పెళ్లైన ఓ జంటకు అరుదైన బహుమతి అందింది. వరుడి స్నేహితులు బ్లూ డ్రమ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది చూసి పెళ్లికొడుకు షాక్‌ కాగా, పెళ్లికూతురు తెగ నవ్వుకుంది. మీరట్‌ భయానక హత్యను గుర్తు చేసిన ఈ బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లోని ఈ సంఘటన సంచలనంగా మారింది.

ఒక జంట వివాహం అనంతరం బంధుమిత్రులు, స్నేహితులు గిఫ్ట్‌లు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు పెద్ద బ్లూ డ్రమ్‌తో వేదికపైకి చేరుకున్నారు. కొత్త జంటకు ఆ బ్లూ డ్రమ్‌ను గిఫ్ట్‌గా సమర్పించారు. ఇది చూసి పెళ్లికొడుకు షాక్‌ అయ్యాడు. పెళ్లికూతురు మాత్రం తెగ నవ్వుకుంది. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

మీరట్‌లో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి సిమ్మెంట్‌తో నింపిన బ్లూ డ్రమ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆ క్రైమ్‌ సీన్‌ను ఇలా గుర్తు చేయడంపై కొందరు నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన జోక్ ఏముంటుంది! పెళ్లి లాంటి సంతోషకరమైన సందర్భంలో హాస్యాస్పదంగా ఒక హత్యను గుర్తుచేసుకోవడం సరికాదు అని సోషల్‌ మీడియా యూజర్స్‌ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రపంచమంతా మానసిక వ్యాధిగ్రస్తులమయంగా మారిందని, మీరట్‌ మారణకాండను ఎగతాళి చేయడం పరిపాటిగా మారిందని మరొక నెటిజన్‌ మండిపడుతూ పోస్టు పెట్టారు. ఇలాంటి స్నేహితులున్న వారికి శత్రువులు అవసరం లేదని మరొక నెటిజన్‌ విమర్శించారు. ఈ మూర్ఖులు పెళ్లికూతురును రెచ్చగొడుతున్నారని మరొకరు విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.

వీడియో చూడండి: