Xiaomi 12: మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్న షావోమి.. 12 సిరీస్‌తో రానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

Xiaomi 12: అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది షావోమి మొబైల్‌ బ్రాండ్‌. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ దిగ్గజ సంస్థ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను..

Xiaomi 12: మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్న షావోమి.. 12 సిరీస్‌తో రానున్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
Xiaomi 12

Edited By: Ram Naramaneni

Updated on: Dec 18, 2021 | 9:18 AM

Xiaomi 12: అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది షావోమి మొబైల్‌ బ్రాండ్‌. చైనాకు చెందిన ఈ స్మార్ట్‌ దిగ్గజ సంస్థ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తూ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను పెంచుకుంటూ పోతోంది. అప్పటి వరకు ఉన్న బడా కంపెనీలను సైతం వెనక్కి నెట్టి మార్కెట్‌ షేర్‌ను హస్తగతం చేసుకుంటోంది షావోమి. ఇప్పటికే వరుసగా పలు స్మార్ట్‌ ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన షావోమీ తాజాగా 12 సిరీస్‌తో కొత్త ఫోన్‌ను తీసుకురానుంది.

ఈ సిరీస్‌లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12ప్రో, షావోమీ 12 అల్ట్రా రానున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ షావోమీ 12కు సంబంధించిన ఫీచర్లు కొన్ని నెట్టింట లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన ఈ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో ఫీచర్లు ఇలా ఎలా ఉండనున్నాయంటే..

* ఈ ఫోన్‌లో 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారని సమాచారం.

* ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. స్క్రీన్‌ ఇన్‌ బిల్ట్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఉండనుంది.

* ఈ ఫోన్‌లో 67w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనున్నట్లు సమాచారం. 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.

* ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ వైర్ లెస్ ఛార్జింగ్‌కి కూడా సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

* 8జీబీ ర్యామ్‌తో రానున్న ఈ ఫోన్‌ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నట్లు సమాచారం.

* 5జీ నెట్‌వర్క్‌పై నడిచే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్లూటూత్ వి5.2 కనెక్టివిటీ ఉంటుందని తెలుస్తోంది.

* ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే సుమారు రూ.69,990గా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: TVS NTorq 125: టీవీఎస్‌ నుంచి సరికొత్త స్కూటర్లు విడుదల.. యువతను ఆకర్షించే విధంగా తయారు..!

GHMC: గ్రేటర్‌లో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీ వార్‌.. తొలి రోజే తగువుకు రెడీ అవుతున్న వైరీ పక్షాలు..

Punjab Elections 2022: కెప్టెన్‌, కమలం పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌ రాజకీయాల్లో కీలక సమీకరణాలు..