AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే

Xiaomi Mijia Smart Air Purifiers.. స్మార్ట్‌ఫోన్లతో భారత మార్కెట్లో చెరగని ముద్ర వేసిన షావోమీ ఇప్పుడు హోమ్ అప్లయెన్సెస్ విభాగంలోనూ తమ పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. తమ ల్యాండ్‌మార్క్ స్మార్ట్ హోమ్ సబ్‌బ్రాండ్ మిజియా ద్వారా త్వరలోనే కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్లను భారత్‌లో దించనుంది. ఆగస్టు 25న మిజియా బ్రాండ్ నుండి రెండు సరికొత్త మోడళ్లు అధికారికంగా విడుదల కానున్నాయి.

షావోమీ మార్కెట్‌లోకి తెస్తున్న గ్యాడ్జెట్‌ గురించి తెలిస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే
Xiaomi Mijia Smart Air Purifiers
Nikhil
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 8:20 AM

Share

భారత్‌లో ఇప్పటికే ఎయిర్ ప్యూరిఫైయర్ల మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. ఇళ్లలో స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం షావోమీ సరికొత్త పరికరాలతో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే వ్యూహంతో వస్తున్న ఈ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ల ప్రత్యేకతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

స్మార్ట్ ఫీచర్లు

మిజియా పేరు మన దేశంలో చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. పెద్ద పెద్ద గదులు, విశాలమైన హాల్స్ కోసం మిజియా స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 6 మోడల్‌ను తీర్చిదిద్దారు. సాధారణ ప్యూరిఫైయర్లు కేవలం దుమ్ము, ధూళిని మాత్రమే గుర్తిస్తే ఇది రక్తంలోకి కూడా చేరగలిగే అతిసూక్ష్మమైన పీఎం 1 కణాలను సైతం గుర్తిస్తుంది. దీనికోసం ఈ ప్యూరిఫైయర్లో 5 ప్రత్యేక సెన్సార్లు ఇచ్చారు. దీనికి తోడు యూవీ-సీ లైటింగ్, నెగెటివ్ అయాన్స్ సాంకేతికత ద్వారా గాలిలోని వైరస్‌లు, బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలిస్తుంది. రాత్రి వేళల్లో అసలు శబ్దం లేకుండా ఇరవై డెసిబెల్స్ స్లీప్ మోడ్‌లో పనిచేయడం దీని మరో ప్లస్ పాయింట్.

కాంపాక్ట్ డిజైన్

చిన్న గదులు లేదా తక్కువ బడ్జెట్‌లో కావాలనుకుంటున్న వారి కోసం మిజియా ఎయిర్ ప్యూరిఫైయర్ 4 కాంపాక్ట్ అందుబాటులోకి వస్తోంది. ఇది పరిమాణంలో చిన్నగా ఉంటూనే గదిలోని గాలిని చాలా వేగంగా శుద్ధి చేస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మోడల్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, అలాగే షావోమీ హోమ్ యాప్‌ల ద్వారా ఈ రెండింటినీ చాలా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. గ్లోబల్‌గా ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ రెండు మోడళ్లు భారత మార్కెట్లో ఎలాంటి విజయాన్ని సాధిస్తాయనేది ఆగస్టు 25న ప్రకటించబోయే ధరలపైనే ఆధారపడి ఉంది. ప్రీమియం ఫీచర్లు, విశ్వసనీయమైన షావోమీ బ్రాండ్ ఇమేజ్ ఈ ప్యూరిఫైయర్లకు పెద్ద ప్లస్ కానున్నాయి.

Follow Us