Secure Smartphone: ఈ ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ఎవరి తరం కాదు.. ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌ ఏంటో తెలుసా?

Secure Smartphone: అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆఫీసు పనులు నుంచి వ్యక్తిగత పనుల వరకు..

Secure Smartphone: ఈ ఫోన్‌ను హ్యాక్‌ చేయడం ఎవరి తరం కాదు.. ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌ ఏంటో తెలుసా?
Follow us

|

Updated on: Sep 13, 2021 | 3:53 PM

Secure Smartphone: అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్లే. ఎక్కడ ఏది జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఆఫీసు పనులు నుంచి వ్యక్తిగత పనుల వరకు అన్నీ స్మార్ట్‌ ఫోన్‌తోనే చేసుకునే రోజులు వచ్చాయి. బ్యాంకింగ్‌ నుంచి మొదలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వరకు అన్ని పనులను స్మార్ట్‌ ఫోన్‌ చేసే రోజులు వచ్చాయి. ఇలా నిత్య జీవితంలో ఓ భాగమైంది స్మార్ట్‌ ఫోన్‌. అయితే ఇదే మాటున హ్యాకింగ్‌ అనే ఓ ప్రమాదం కూడా పొంచి ఉంది. స్మార్ట్‌ ఫోన్‌లను చాలా సులువుగా హ్యాకింగ్‌ చేయొచ్చనే వాదన ఎప్పటి నుంచే ఉంది. యాప్‌ల ద్వారా స్మార్ట్‌ ఫోన్‌ను హ్యాకింగ్‌ గురైన సంఘటనలు గతంలో మనం చాలా చూశాం. మరి అసలు హ్యాకింగ్‌కు గురికాని స్మార్ట్‌ ఫోన్‌ ఈ భూమ్మీద లేదా.? అంటే జర్మనీ నుంచి ఉందనే సమాధానం వస్తోంది. జర్మనీకి చెందిన ఓ సంస్థ రూపొందించిన స్మార్ట్‌ ఫోన్‌ ప్రపంచంలో అత్యంత సెక్యూర్‌ ఫోన్‌గా నిలిచింది.

జర్మనీకి చెందిన నైట్రోకీ కంపెనీ తయారు చేసిన నైట్రోఫోన్‌ 1 ఫోన్‌ అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ ఫోన్‌గా ‘9 To 5 Google’ నివేదికలో వెల్లడైంది. అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల రూపకల్పకు పెట్టింది పేరైన నైట్రోకీ కంపెనీ తయారు చేసిన ఈ ఫోన్‌లో సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఫోన్‌లో గూగుల్‌కు సంబంధించి ఎలాంటి యాప్స్‌ రావు, అంతేకాకుండా ఇందులో గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ ఫొటోస్‌ వంటి యాప్స్‌కు యాక్సెస్‌ ఉండదు.

ఇక ఆన్‌లైన్‌లో సురక్షితమైన బ్రౌజింగ్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక క్రోమియం బ్రౌజర్‌ను అందించారు. ఫోన్‌ IMEI నెంబర్‌, మ్యాక్‌ అడ్రస్‌ అందరికీ కనిపించదు. ఈ ఫోన్‌ మన కరెన్సీలో రూ. 50 వేలకు పైమాటే. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ కెర్నల్, వెబ్‌వ్యూ, కంపైలర్ టూల్‌చైన్, ఫైల్ సిస్టమ్ యాక్సెస్ వంటి ఫీచర్లను అందించారు. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ సురక్షితంగా ఉంటుంది.

Also Read: Oscar Fernandes: కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెస్ కన్నుమూత.. మంగళూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

Viral Video: మందుబాబులకు తలతిరిగిపోయే సమాధానమిచ్చిన ఆవు..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..