Whatsapp Update: ఏఐ సాయంతో వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై ఫొటోలను కూడా..

|

Jul 10, 2024 | 3:28 PM

స్మార్ట్ ఫోన్స్‌లో వాట్సాప్ యాప్‌ను ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమో? అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే వాట్సాప్ వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ అప్‌డేట్స్‌తో మన ముందుకు వస్తుంది. తాజాగా వాట్సాప్ తన ఫోటో ఇంటరాక్షన్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తన ఏఐ చాట్‌బాట్ సాయంతో కొత్త అప్‌డేట్‌పై పని చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అప్‌డేట్ మెటా ఏఐ చాట్‌బాట్‌ను వినియోగదారులు పంపిన ఫోటోలకు రిప్లయ్ ఇవ్వడానికి, వాటిని ప్రాంప్ట్‌లో సవరించడానికి అనుమతిస్తుంది.

Whatsapp Update: ఏఐ సాయంతో వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఇకపై ఫొటోలను కూడా..
New Feature In Whatsapp
Follow us on

ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌లో ఉండే వివిధ యాప్స్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్‌లో వాట్సాప్ యాప్‌ను ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తున్నారు. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమో? అన్నట్లుగా పరిస్థితి ఉంది. అయితే వాట్సాప్ వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ అప్‌డేట్స్‌తో మన ముందుకు వస్తుంది. తాజాగా వాట్సాప్ తన ఫోటో ఇంటరాక్షన్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తన ఏఐ చాట్‌బాట్ సాయంతో కొత్త అప్‌డేట్‌పై పని చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అప్‌డేట్ మెటా ఏఐ చాట్‌బాట్‌ను వినియోగదారులు పంపిన ఫోటోలకు రిప్లయ్ ఇవ్వడానికి, వాటిని ప్రాంప్ట్‌లో సవరించడానికి అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో తాజా అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో భాగమైన మెటా ఏఐ ప్రస్తుతం ప్రశ్నలకు సమాధానమివ్వడం, క్యాప్షన్‌లను సూచించడంతో పాటు వినియోగదారులతో సంభాషణలు చేయడం వంటి ఆకట్టుకునే టెక్స్ట్ సామర్థ్యాలను అందిస్తోంది. అయితే ఇటీవల టెక్ నిపుణులు వాట్సాప్ బీటాలో మెటా ఏఐ ద్వారా కొత్త ఫోటో ఎడిట్ ఫీచర్‌ను గుర్తించారు. అయితే ఈ తాజా అప్‌డేట్ త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం మెసేజింగ్ యాప్ మెటా ఏఐ చాట్‌బాట్‌లో కెమెరా బటన్‌ను జోడించడాన్ని పరిశీలిస్తోందని తెలుస్తుంది. ఈ ఫీచర్ సాధారణ చాట్‌లలోని కెమెరా బటన్‌ను పోలి ఉంటుంది. వినియోగదారులు తమ చిత్రాలను ఏఐ చాట్‌బాట్‌తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులను విషయాలు లేదా స్థానాలను గుర్తించడానికి లేదా ఫోటో కంటెంట్ కోసం సందర్భాన్ని అందించడానికి ఏఐని అడగడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ఫంక్షనాలిటీ టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా ఫోటోలను సవరించే ఎంపికను కూడా అందిస్తుంది.

వాట్సాప్ మెటా ఏఐ ఏ స్థాయిలో ఇమేజ్ ఎడిటింగ్ చేయగలదో? ఇప్పటికీ అస్పష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఏఐ ఆధారిత చిత్ర సవరణ సాధనాలతో పోలిస్తే మెటా ఏఐ ఫొటోలో ఎంచుకున్న వస్తువును తీసివేయగలదు. అలాగే బ్యాక్‌ గ్రౌండ్‌ను తీసేసి, మరో కొత్త బ్యాక్ గ్రౌండ్‌ను అప్‌డేట్ చేస్తుంది. స్క్రీన్‌షాట్‌ల ప్రకారం అప్‌లోడ్ చేసిన చిత్రాలు ఏఐ ద్వారా విశ్లేషిస్తుంది. అయితే డిజిటల్ ఏఐ అవతార్‌లను రూపొందించడానికి మెటా ఏఐని అనుమతించే కొత్త ‘ఇమాజిన్ మీ’ ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోందని మునుపటి నివేదికలు సూచించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..