Jio 399 ప్లాన్‌తో ఫ్రీగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం సినిమాలు చూసేయొచ్చు..పూర్తి వివరాలు తెలుసుకోండి..

| Edited By: Ravi Kiran

Mar 08, 2023 | 9:45 AM

మీరు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వంటి ఓటీటీ ఫ్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ పొందాలనుకుంటున్నారా. అయితే మీకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Jio 399 ప్లాన్‌తో ఫ్రీగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం సినిమాలు చూసేయొచ్చు..పూర్తి వివరాలు తెలుసుకోండి..
Jio 5g
Follow us on

మీరు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వంటి ఓటీటీ ఫ్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ పొందాలనుకుంటున్నారా. అయితే మీకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం సబ్ స్క్రిప్షన్ కొనుగోలు చేసుకోవడం. లేదు అనుకుంటే మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవడం. మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకుంటే అమెజాన్ నెట్‌ఫ్లిక్స్ ఎలా వస్తాయనే కదా మీ డౌట్ . అయితే ఈ విషయం తెలుసుకోండి. టెలికం కంపెనీలు పలు రీచార్జ్ ప్లాన్లపై ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్ష్ అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఇప్పుడు జియో అందిస్తున్న 399 ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇది పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఇందులో కూడా మీరు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ పొందవచ్చు. ఇంకా నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంటుంది. ఇవే కాకుండా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా పంపొచ్చు. అంతేకాదు నెలకు 75 జీబీ డేటా వస్తుంది. ఇలా పలు రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

రిలయన్స్ జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:

ఇవి కూడా చదవండి

రిలయన్స్ జియో రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ చెల్లుబాటు ఒక బిల్లు సైకిల్ వంటిది. ఈ ప్లాన్‌లో, జియో కస్టమర్లకు 75GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 200GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉన్న డేటాలో కస్టమర్లు మొత్తం డేటాను ఖర్చు చేయలేకపోతే, మిగిలిన డేటా వచ్చే నెల పరిమితికి జోడించబడుతుంది. ప్లాన్‌లో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ ముగిసిన తర్వాత జియో కస్టమర్‌లు GBకి రూ. 10 చొప్పున డేటాను ఉపయోగించవచ్చు.

ఇదే కాకుండా, జియో తన కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్‌లను కూడా అందిస్తుంది. అంటే దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా కస్టమర్‌లు అపరిమిత లోకల్ STD కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100ఎస్ఎంఎస్ లు కూడా అందిస్తుంది. రూ. 399 ప్లాన్‌లో లభించే ఇతర ప్రయోజనాల తెలుసుకుంటే ఆపై నెట్‌ఫ్లిక్స్ (మొబైల్ ప్లాన్), అమెజాన్ ప్రైమ్, జియోటీవీ, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ వంటి సౌకర్యాలు వినియోగదారులకు ఉచితంగా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.

మీరు జీయో 5జీ సేవలను ఉపయోగిస్తుంటే, మీరు ఈ ప్లాన్‌తో అపరిమిత 5G డేటాను ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి