WiFi: ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా..? రౌటర్ అక్కడ పెడితే మీ సమస్య తీరినట్లే.. బెస్ట్ ప్లేస్ ఇదేనట..
వైఫై రౌటర్‌ను ఎక్కడపడితే అక్కడ పెడుతుంటారు. సరైన ప్రదేశంలో పెట్టకపోతే వైఫై స్పీడ్ తగ్గే అవకాశముంది. సిగ్నల్స్ సరిగ్గా వచ్చే ప్లేస్‌లో రౌటర్ పెట్టడం వల్ల ఇంటర్నెట్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో రౌటర్ ఎక్కడ పెట్టుకోవాలి.. ఎక్కడెక్కడ పెట్టకూడదు అనే విషయాలు చూస్తే..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ లేనిది ఏ పని జరగడం లేదు. ఆన్‌లైన్‌లో వేగంగా పనులు జరగాలంటే వైఫై అనేది తప్పనిసరిగా మారిపోయింది. మొబైల్ డేటా వేగవంతంగా ఉండదు. అదే వైఫై స్పీడ్ వేగంగా ఉండటం వల్ల ఆన్‌లైన్‌లో ఏ పనైనా క్షణాల్లో పూర్తవుతుంది. ఇక గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్‌లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. కంపెనీలు వర్క్ ఫ్రం హోం, రిమోట్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఇలాంటి ఉద్యోగులకు ఇంట్లో వైఫై అనేది అవసరం. అయితే కొన్నిసార్లు వైఫై సరిగ్గా పనిచేయక, స్పీడ్ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతుంటారు. తరచుగా చాలామంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల వైఫై వేగంగా వచ్చే అవకాశముందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
రౌటర్ ఎక్కడ పెట్టారంటే..?
వైఫై స్పీడ్ బాగానే ఉన్నా స్లోగా వస్తుందని చాలామంది బాధపడుతుంటారు. దీంతో ఎక్కువ స్పీడ్ వచ్చే ప్లాన్‌కు అప్‌గ్రేడ్ అవుతుంటారు. ఇందుకు వేలకు వేలు ఖర్చు పెడతారు. కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అందులో ఒకటి ఇంట్లో వైఫై రౌటర్ ప్లేస్ మార్చడం. దీని వల్ల ఇంటర్నెట్ స్పీడ్ మెరుగుపడే అవకాశముంది. సిగ్నల్స్ సరిగ్గా అందని తప్పుడు ప్రదేశంలో రౌటర్ పెట్టుకుంటుంటారు. దీని వల్ల సిగ్నల్స్ అందక ఇంటర్నెట్ స్లోగా వస్తుంది. దీంతో ఒక మూలలో రౌటర్ పెట్టడం కాకుండా మధ్యలో బిగించుకోవాలి. దీని వల్ల అన్ని రూమ్స్‌కు ఇంటర్నెట్ వస్తుంది. ఇక చాలామంది నేలపై రౌటర్ పెడుతూ ఉంటారు. పొరపాటున ఇలా చేయకూడదు. ఇక టీవీ క్యాబినెట్‌లో కూడా పెట్టకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. వైఫై రౌటర్‌ను 5 నుంచి 7 అడుగుల ఎత్తులో షెల్ప్ లేదా గోడకు దగ్గరగా ఉంచాలి.
సిగ్నల్స్ బాగా రావాలంటే..?
ఎత్తులో ఉండటం వల్ల సిగ్నల్స్ బాగా అందుతాయి. దీని వల్ల ఇంటర్నెట్ బాగా వస్తుంది. ఇక రౌటర్‌ను టీవీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉంచాలి. ఇక కబోర్డ్స్, అద్దాల వెనుక రౌటర్ ఉంచకూడదు. ఇక రౌటర్ రెండు యాంటెనాలు సరైన దిశలో ఉండాలి. ఒకటి నిలువుగా, మరొకటి అడ్డంగా ఉండకూడదు. ఈ టిప్స్ పాటిస్తే వైఫై స్పీడ్ బాగా రావడంతో పాటు ఎలాంటి అవాంతరాలు ఉండవు. ఈ విషయాలు తెలియక చాలామంది వైఫై రావడం లేదని ఫీల్ అవుతుంటారు. ముందుగా ఈ టిప్స్ పాటించండి. అప్పటికీ రాకపోతే వైఫై ప్లాన్ అప్ గ్రేడ్ చేసుకోండి.
