Octopus Facts: ఆక్టోపస్‌ జీవిత కాలం ఎంత..? దీని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు

|

Nov 27, 2022 | 6:43 PM

ఆక్టోపస్‌.. దీని గురించి చెప్పాలంటే అన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. ఆక్టోపస్‌ ఇతర జీవులకంటే భిన్నంగా ఉంటుంది. దీని శరీరం గురించి తెలిస్తే అన్ని ప్రత్యేకమే. ఆక్టోపస్ అంటే ఎనిమిది..

Octopus Facts: ఆక్టోపస్‌ జీవిత కాలం ఎంత..? దీని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు
Octopus
Follow us on

ఆక్టోపస్‌.. దీని గురించి చెప్పాలంటే అన్ని ఆసక్తికరంగానే ఉంటాయి. ఆక్టోపస్‌ ఇతర జీవులకంటే భిన్నంగా ఉంటుంది. దీని శరీరం గురించి తెలిస్తే అన్ని ప్రత్యేకమే. ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్లు వుండే జీవి. దీనికి వెన్నెముక లేదు. వెన్నెముక లేని జీవులలో కెల్లా ఆక్టోపస్ చాలా తెలివైనది. ఆక్టోపస్ శరీరం లోపల గానీ బయట గాని అస్తిపంజరం లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రదేశముల్లో కూడా చాలా సులువుగా దూరిపోతుంది. . ఇది ఎక్కువగా సముద్రాల్లో జీవిస్తుంది. కొన్ని ఆక్టోపస్‌లు ఆరు నెలలు మాత్రమే ప్రాణాలతో ఉంటాయి. మగ ఆక్టోపస్‌లు మేటింగ్ తర్వాత కొద్ది నెలలకే చనిపోతాయి. ఆక్టోపస్ శరీరంలో ఉండే రెండు ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండోక్రైన్ స్రావాల వల్ల జన్యుపరంగా ముందుగానే చనిపోతుంటాయి.

అయితే శాస్త్రజ్ఞులు ఈ గ్రంథులను ఆపరేషన్ ద్వారా తొలగిస్తే ఆక్టోపస్‌లు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆక్టోపస్‌ల జీవిత కాలం చాల తక్కువేనని చెప్పాలి. అయితే ఆక్టోపస్‌ల మరణానికి వాటి పునరుత్పత్తే కారణం అవుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అక్టోబపస్‌కు ఉండేవి కాళ్ళు అని అనుకుంటారు. కానీ అవి కాళ్లు కాదు. చేతులు. అలాగే ఇది ప్రతి చేతిలో మెదడు ఉంటుంది. ఈ జీవికి 9 మెదడులు ఉండటం గమనార్హం. ఇది ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీనితో పాటు, దాని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే ఈ జీవి ఇతర జీవుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

దీనికి ఉండే చేతులు ఎంతో ఉపయోగపడతాయట. ఏ జీవి నుండి అయినా రక్షించడానికి ప్రతి వైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణాన్ని పొందకపోతే అది విసుగు చెందుతుందట. ఆపై తన చేతులను తానే కొరుకుకోవడం ప్రారంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్టోపస్‌ల నాడీ వ్యవస్థ కాస్త పెద్దగానే ఉంటుంది. సగటున ఒక్కో ఆక్టోపస్‌లో 50 కోట్ల నాడీ కణాలు లేదా మెదడు కణాలు ఉంటాయట. అయితే, శునకాలు, మనుషులు, ఇతర జీవులకు భిన్నంగా ఆక్టోపస్‌లలో ఎక్కువ నాడీకణాలు ‘టెంటకల్స్’ అంటే చేతుల్లో ఉంటాయి. నిజానికి మెదడులో కంటే వాటి టెంటకల్స్‌లోనే రెట్టింపు సంఖ్యలో నాడీకణాలు ఉంటాయి. ఆక్టోపస్ టెంటక్స్‌లోని ప్రతి బొడిపె మీద దాదాపు 10,000 నాడీకణాలు ఉంటాయి. ఇవి స్పర్శ, రుచికి తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి