- Telugu News Photo Gallery Technology photos Black Friday, Flipkart, flipkart offers, Nothing Phone 1, Smartphone Telugu Tech News
Nothing phone 1: రూ. 8 వేలకే నథింగ్ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగంటే..
ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై ఈకామర్స్ సైట్లు భారీ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే నథింగ్ ఫోన్ 1ను రూ. 8 వేలకే సొంతం చేసుకునే అవకాశం లభించనుంది..
Updated on: Nov 27, 2022 | 8:14 PM

నథింగ్ ఫోన్ 1కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్ సేల్ జరుగుతోంది. అయితే ఈ ఫోన్‌పై మునుపెన్నడూ లేని భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఫ్రైడే సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ఫోన్ అసలు ధర రూ. 37,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా 27 శాతం డిస్కౌంట్‌తో రూ. 27,499కి అందుబాటులో ఉంది. అయితే పలు బ్యాంకుల కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 డిస్కౌంట్ పొందొచ్చు.

నథింగ్ ఫోన్‌పై ఆఫర్ ఇంక అయిపోలేదు.. ఏదైన పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 17500 వరకు పొందొచ్చు. దీంతో నథింగ్ ఫోన్ 1 కేవలం రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు. నవంబర్ 30 తేదీ వరకే ఆఫర్ అందుబాటులో ఉంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778డీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహ్చ్ బ్యాటరీని అందించారు. టైప్‌సీ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది.




