WhatsApp: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా.? వెంటనే ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి..

వాట్సాప్‌ ద్వారా ఇటీవల మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాట్సాప్‌ను హ్యాక్‌ చేయడం మొదలు, గ్రూప్స్‌లో యాడ్‌ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పేరుతో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

WhatsApp: మీరు వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా.? వెంటనే ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి..
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 17, 2024 | 8:05 AM

స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరు కచ్చితంగా వాట్సాప్‌ను వాడుతుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే ఏకైక మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు పేరుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌కు ఎక్కడ లేని క్రేజ్‌ ఉంది. అయితే వాట్సాప్‌ను కూడా కొందరు కేటుగాళ్లు మోసాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా కూడా మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ కొన్ని రకాల ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సెట్టింగ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తెలియని వ్యక్తులు ఎవరైనా వాట్సాప్‌ గ్రూప్‌లలో యాడ్‌ చేయకుండా ఉండాలంటే ఒక సెట్టింగ అందుబాటులో ఉంది. ఇందుకోసం ముందుగా వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి. అనంతరం గ్రూప్స్‌ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే మూడు ఆప్షన్స్‌లో ‘మై కాంటాక్ట్స్‌’ సెలక్ట్‌ చేసుకోవాలి. దీంతో కేవలం మీ కాంటాక్ట్‌ నెంబర్స్‌లో ఉన్న వారు మాత్రమే మిమ్మల్ని గ్రూప్స్‌లో యాడ్‌ చేసే అవకాశం ఉంటుంది.

* ఇక ప్రైవసీ సెట్టింగ్స్‌లో కనిపించే అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం అందులో కనిపించే మూడు ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. వీటివల్ల తెలియని అకౌంట్స్‌ను సందేశాలు రాకుండా ఉండడమే కాకుండా మీ ఐపీ అడ్రస్‌ భద్రంగా ఉంటుంది.

* అలాగే ఇటీవల వాట్సాప్‌ డీపీలతో కూడా కొందరు కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. డీపీలను మార్ఫింగ్ చేస్తూ డబ్బులు లాగేస్తున్నారు. ఈ సమస్య బారిన పడకుండా ఉండలంటే మీ వాట్సాప్‌ డీపీ కేవలం మీ కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపించే సెట్టింగ్‌ చేసుకోవాలి. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీలో డీపీ కేవలం మీ కాంటాక్ట్‌లో ఉన్న వారికి మాత్రమే కనిపించేలా ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..