AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tablet market: టాబ్లెట్ మార్కెట్ కు ఫుల్ జోష్. ఎంత శాతం విక్రయాలు పెరిగాయంటే..?

దేశంలో సాంకేతిక ప్రగతి పరుగులు తీస్తోంది. అన్ని రంగాలలో కంప్యూటర్ల వాడకం పెరిగింది. మన పనులను ఎంతో సులువుగా చేసుకునే అవకాశం కలిగింది. చదువు, వ్యాపారం, ఉద్యోగం తదితర అవసరాలను అనుగుణంగా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగిస్తున్నారు. కంప్యూటర్లు కూడా కాలానికి అనుగుణంగా మారుతూ స్మార్ట్ గా తయారవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో టాబ్లెట్ మార్కెట్ జోరుగా దూసుకుపోతోంది. వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

Tablet market: టాబ్లెట్ మార్కెట్ కు ఫుల్ జోష్. ఎంత శాతం విక్రయాలు పెరిగాయంటే..?
Best Affordable Tablets
Nikhil
|

Updated on: Nov 16, 2024 | 7:00 PM

Share

ఈ ఆర్థిక సంవత్సరంలోని జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో టాబ్లెట్ మార్కెట్ 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. టచ్ స్క్రీన్ ఇంటర్ ఫేస్ తో ఉన్న వైర్ లెస్, పోర్టబుల్ పర్సనల్ కంపూటర్ నే టాబ్లెట్ (టాబ్లెట్ పీసీ) అని పిలుస్తారు. ఇది స్మార్ట్ ఫోన్ కంటే పెద్దదిగా, నోట్ బుక్ కంటే చిన్నగా ఉంటుంది. చాలా తేలికగా ఉండడంతో ఎక్కడికైనా చాాలా సులభంగా తీసుకువెళ్లవచ్చు. కంప్యూటర్ చేసే అన్ని పనులను దీనితో చేసుకోవచ్చు. బయట కీబోర్డు, మౌస్ అవసరం లేకుండా అనేక అప్లికేషన్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దేశంలోని టాబ్లెట్ మార్కెట్ ఈ త్రైమాసికంలో గణనీయమైన ప్రగతి సాధించింది. విక్రయాలలో దాదాపు 46 శాతం వృద్ధి నెలకొంది. ఆపిల్ కంపెనీకి చెందిన ఐప్యాడ్ దీనిలో 34 శాతం వాటా దక్కించుకుంది. ముఖ్యంగా రూ.20 వేల నుంచి ర.30 వేల ధరలోని టాబ్లెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. దాదాపు 108 శాతం వైవై పెరుగుదలను నెలకొల్పాయి.

భారతీయ టాబ్లెట్ మార్కెట్ ఏడాదికి 46 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే 79 శాతం క్వార్టర్ ఆన్ క్వార్టర్ (క్యూఓక్యూ) వృద్ధిని నెలకొల్పింది. ప్రధానంగా 5జీ టాబ్లెట్ల విక్రయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. ఆపిల్ ఐప్యాడ్ 34 శాతం వాటాతో 95 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. సామ్సంగ్ 35 శాతం మార్కెట్ వాటాతో 70 శాతం వృద్ధితో రెండో స్థానంలో కొనసాగుతోంది. రెడ్ మీ దాదాపు 145 శాతం పెరిగినప్పటికీ 15 శాతం మార్కెట్ వాటాతో మూడు స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో లెనోవా వాటా మాత్రం 13 శాతం క్షీణిాంచింది. వన్ ప్లస్ వాటా 4 నుంచి 6 శాతానికి పెరిగింది.

గతేడాదిలో పోల్చితే ఈ సారి మార్కెట్ అంచనా బలమైన ప్రగతి సాధించాయి. రెండంకెలలో పెరుగుదల నమోదైంది. ప్రీమియం టాబ్లెట్లకు పెరుగుతున్న డిమాండ్ ను ఇది సూచిస్తోంది. ఎడ్ టెక్, హెల్త్ టెక్, హాస్పిటాలిటీ టెక్ వంటి వాటిలో పెరుగుతున్న అవకాశాలతో పాటు వాణిజ్య టాబ్లెట్లకు కూడా డిమాండ్ ఎక్కువవుతోంది. ల్యాప్ టాప్ ల కంటే టాబ్లెట్లు అత్యంత పోర్టబుల్ పరికరాలు. చిన్న పరిమాణంలో ఉండడంతో ఎక్కడకైనా తీసుకువెళ్లడం చాలా సులభం. అలాగే స్టార్ట్ ఫోన్లతో పోల్చితే వీటి స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది. ఎక్కువ స్టోరేజీని, బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. టాబ్లెట్లను పోర్ట్రెయిట్, ల్యాండ్ స్కేప్ మోడలలో వినియోగించుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండడంతో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి