
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సాప్ ఓ అదిరిపోయే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ప్రత్యేకమైన యూజర్ పేర్లను పరిచయం చేయనుంది. యూజర్లు తమ మొబైల్ నంబర్‌లను వెల్లడించకుండానే చాట్ చేయడానికి వీలు కల్పించనుంది. తాజా ఫీచర్ చాలా కాలంగా డెవలప్‌మెంట్‌లో ఉంది. వాట్సాప్ తాజా ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ (2.25.28.12)లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
WABetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp యూజర్లు వారి ప్రొఫైల్ సెట్టింగ్‌ల నుండి నేరుగా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో యూజర్లు ఇకపై చాట్ చేయడానికి ఇకపై వారి ఫోన్ నంబర్‌లను పంచుకోవాల్సిన అవసరం ఉండదు. బదులుగా వారు Instagram లేదా Facebookలో లాగా వారి యూజర్ నేమ్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వ్యాపారం లేదా ఆన్‌లైన్ పరస్పర చర్యల కోసం వ్యక్తిగత సంప్రదింపు వివరాలను పంచుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల కోసం WhatsAppను మరింత ప్రైవేట్‌గా, సరళంగా చేయడానికి యూజర్ నేమ్ వ్యవస్థ రూపొందించారు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌లోని పరిమిత బీటా వినియోగదారుల సమూహంతో టెస్టింగ్‌లో ఉంది. ఇది ఇంకా Google Play బీటా ప్రోగ్రామ్ కింద ఉన్న అన్ని వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. WhatsApp యూజర్‌నేమ్ ఫీచర్‌ను త్వరలో మరిన్ని బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి