Whatsapp: ఇక నుంచి ఆ టెన్షన్‌ అవసరం లేదు.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌!

|

Jan 28, 2025 | 8:41 AM

WhatsApp: వాట్సాప్‌.. ఇది తెలియని వారుంటూ ఉండరు. ప్రతి ఒక్కరి ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌ ఉండాల్సిందే. వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా వాట్సాప్‌ సంస్థ సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను తీసుకురానుంది..

Whatsapp: ఇక నుంచి ఆ టెన్షన్‌ అవసరం లేదు.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్న వాట్సాప్‌!
Follow us on

వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం రకరకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఎంతో మంది ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతున్నారు. వాట్సాప్‌ ఇప్పుడు మరో ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఇప్పటి నుండి మీరు ఇక మొబైల్‌లో ఎక్కువ ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఐఓఎస్ యూజర్లు మొదటగా ప్రయోజనం పొందుతుండగా, తర్వాత ఇతర యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీరు ఒక ఫోన్‌లో బహుళ WhatsApp ఖాతాలను ఎలా రన్ చేయవచ్చు.. దాని నుంచి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: February School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

WaBetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం సంస్థ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ త్వరలో ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను పరిశీలించిన తర్వాత తాజా WhatsApp బీటా iOS 25.2.10.70 అప్‌డేట్‌లో కనిపిస్తుంది. ఇది ఒకే ఫోన్‌లో ఎక్కువ వాట్సాప్‌ అకౌంట్ల మధ్య మారడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఎక్కువ ఖాతాలను నిర్వహించగలిగే విధంగానే ఒకే ఫోన్‌లో ఎక్కువ ఫోన్‌ నంబర్లతో వాట్సాప్‌ అకౌంట్లను మార్చడానికి ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. కొత్త ఫీచర్‌తో మీరు నేరుగా ఒక వాట్సాప్ ఖాతా నుండి మరొక ఖాతాకు మారవచ్చు.

ఈ ఫీచర్‌ను ప్రారంభించడంతో వాట్సాప్ వినియోగదారులు ఒకే ఫోన్‌లో వేర్వేరు నంబర్‌ల నుండి వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. మీరు ఒక వాట్సాప్‌లో అనేక నంబర్లను నిర్వహించవచ్చు. ప్రస్తుతం, మీరు ఇతర నంబర్‌ల నుండి WhatsAppని నిర్వహించడానికి వాట్సాప్‌ బిజినెస్‌ను ఉపయోగించాలి. కానీ కొత్త ఫీచర్లు దీన్ని సులభతరం చేస్తాయి. దీని కోసం మీకు ప్రత్యేక ఫోన్‌ అవసరం లేదు. ఒకే ఫోన్‌లో వాట్సాప్‌ ఖాతాలను రన్‌ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Google: మీరు గూగుల్‌లో వీటిని సెర్చ్‌ చేస్తున్నారా..? ఇక జైలుకే..!

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత ఐఓఎస్ లో ఈ అప్ డేట్ వచ్చింది. ఆండ్రాయిడ్‌లో ఒకేసారి రెండు ఖాతాలను అమలు చేయడానికి డ్యూయల్ సిమ్ సెటప్ అవసరం. అయితే కొత్త iOS అప్‌డేట్ వినియోగదారులు తమ చాట్‌లన్నింటినీ ఒకే యాప్‌లో ఉంచుకునేలా చేయడం ద్వారా ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాలను విడివిడిగా ఉంచుతూ వారి చాట్‌లు, సందేశాలను ఒకే యాప్‌లో నిర్వహించగలుగుతారు.

ప్రతి ఖాతాకు సెట్టింగ్‌లు భిన్నంగా ఉంటాయి

నోటిఫికేషన్‌లు, చాట్, బ్యాకప్‌లు, సెట్టింగ్‌లు ప్రతి ఖాతాకు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి ఖాతాపై మీకు మెరుగైన నియంత్రణను అందిస్తాయి. డ్యూయల్ సిమ్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఇకపై ఒక సిమ్‌ను వాట్సాప్‌కు, మరొకటి వాట్సాప్ బిజినెస్‌కు కేటాయించాల్సిన అవసరం లేదు. బదులుగా, ప్రధాన యాప్ రెండు నంబర్లను కలిపి నిర్వహించడంలో సహాయపడుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి