మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ యాప్ ఎప్పటికప్పుడు తీసుకొచ్చే కొంగొత్త ఫీచర్లే దీనికి కారణంగా చెప్పొచ్చు. యూజర్ల వ్యక్తిగత ప్రైవసీకి పెద్దపీట వేస్తూనే.. కొంగొత్త ఫీచర్లను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది.
గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో ‘మెన్షన్’ అనే ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫీచర్ యజర్లకు అందుబాబుటోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటీ మెన్షన్ ఫీచర్.? అసలు ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది.? దీనిని ఎలా ఉపయోగించుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏదైనా స్టోరీ అప్లోడ్ చేసిన సమయంలో నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ‘@’ సింబల్‌తో ఇలా మీకు నచ్చిన వ్యక్తులను ట్యాగ్ చేసుకుంటారు. దీంతో కచ్చితంగా వాళ్లకు మన స్టోరీ కనిపిస్తుంది. వాట్సాప్‌లో తీసుకొచ్చిన ‘మెన్షన్’ ఫీచర్ కూడా ఇలాంటిదే. వాట్సాప్‌లో మనం స్టేటస్ పోస్ట్ చేసే సమయంలో కాంటాక్ట్‌లోని నచ్చిన వ్యక్తులకు ట్యాగ్ చేయొచ్చు.
స్టేటస్ అప్లోడ్ చేసే సమయంలో.. ‘యాడ్ క్యాప్సన్ అనే’ బార్‌కు కుడివైపున ‘@’ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీ వాట్సప్‌లోని కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన వ్యక్తులను సెలక్ట్ చేసుకోవచ్చు. దీంతో మీరు స్టేటస్ అప్లోడ్ చేయగానే వాళ్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో లాగా మీరు ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదు. దీంతో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఢోకా ఉండదన్నమాట.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..