Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనూ రీల్స్.. యువతను ఆకర్షించేలా సూపర్ ఫీచర్ లాంచ్..!

భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్స్‌లో సోషల్ మీడియా యాప్స్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్స్‌లో రీల్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాప్ వాట్సాప్‌లో కూడా రీల్స్ చూసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Whatsapp: ఇకపై వాట్సాప్‌లోనూ రీల్స్.. యువతను ఆకర్షించేలా సూపర్ ఫీచర్ లాంచ్..!
Whatsapp

Updated on: Apr 05, 2025 | 2:17 PM

వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అతి పెద్ద ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. మనం రోజువారీ పనుల్లో అనేక పనుల్లో వాట్సాప్ సహాయం తీసుకుంటున్నామంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా యువత అమితంగా ఇష్టపడే రీల్స్‌ను వాట్సాప్‌లో కూడా చూసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ నేడు ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్‌స్ంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా ప్రజలు ఈ అప్లికేషను ఉపయోగిస్తున్నారు. చాలా మంది మెసేజింగ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ కోసం వాట్సాప్‌ను

ఉపయోగిస్తున్నారు. రోజువారీ దినచర్యలోని అనేక పనులు కూడా ఇప్పుడు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. వాట్సాప్ నుండి చాలా పనులు జరుగుతున్నప్పుడు వినోదం కోసం వేరే ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లకుండా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.  వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్  వంటి గొప్ప ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని దీని ద్వారా మీరు చాలా వినోదాన్ని పొందవచ్చని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రీల్స్, షార్ట్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. బస్సు, రైలు, రెస్టారెంట్, స్టేషన్, ఆఫీస్ వంటి ప్రతిచోటా రీల్స్ చూసే వ్యక్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్స్‌లోని రీల్స్‌ను ఇకపై వాట్సాప్‌లో కూడా చూడవచ్చు. వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న రీల్స్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. మీరు కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా వాట్సాప్‌లో రీల్స్ చూడవచ్చు. 

రీల్స్ చూడడం ఇలా

  • వాట్సాప్‌లో రీల్స్ చూడడానికి ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌ను తెరవాలి. 
  • స్క్రీన్‌పై కనిపించే మెటా చిహ్నాన్ని ఎంచుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మెటా ఐకాన్ స్థానం భిన్నంగా ఉండవచ్చు.
  • మెటా ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్త పేజీ, యూజర్ ఇంటర్ ఫేస్‌ కనిపిస్తుంది.
  • అక్కడ షో మై రీల్స్‌ను ఎంచుకుంటే వాట్సాప్‌లో రీల్స్ చూడవచ్చు.