WhatsApp Fake Calls: మీ వాట్సాప్‌కి కూడా ఫేక్ కాల్స్ వస్తున్నాయా..? సింపుల్‌గా చెక్ పెట్టేయండిలా.. లేదంటే క్షణాల్లోనే..

|

May 12, 2023 | 8:49 PM

WhatsApp Fake Calls: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి. తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా, మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేసినా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం..

WhatsApp Fake Calls: మీ వాట్సాప్‌కి కూడా ఫేక్ కాల్స్ వస్తున్నాయా..? సింపుల్‌గా చెక్ పెట్టేయండిలా.. లేదంటే క్షణాల్లోనే..
Whatsapp Fake Calls
Follow us on

WhatsApp Fake Calls: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికీ అప్పుడప్పుడు ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి. తెలిసీ తెలియక కాల్ లిఫ్ట్ చేసినా, మెసేజ్‌లోని లింక్‌లపై క్లిక్ చేసినా మోసపోయినట్లే. క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలన్స్ మాయమవడం జగిరిపోతుంది. అంతేనా..? మీ వాట్సాప్‌లోని చాట్‌లతో పాటు, యాప్ వాయిస్, వీడియో కాల్‌లకు కూడా యాక్సెస్‌ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా +84, +62, +60 వంటి పలు అంతర్జాతీయ నంబర్ల నుంచి కొన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ వాట్సాప్ యూజర్లే ఇందుకు టార్గెట్‌గా మారారు. అంతర్జాతీయ స్పామ్ కాల్స్ గురించి వచ్చిన నివేదికలపై భారత ప్రభుత్వం వాట్సాప్‌కు నోటీసు కూడా పంపుతోంది. ఇక ఈ ఫేక్ కాల్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు.

అయితే మీరు తెలియని నంబర్ల నుంచి వచ్చే అన్ని రకాల కాల్స్‌కు చెక్ పెట్టేయోచ్చు. వాట్సాప్ ప్రస్తుతం గుర్తుతెలియని కాల్స్‌ను సైలెంట్ చేసేందుకు ఓ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.

ఆ ఫీచర్‌ని ఎలా ఆన్ చేయాలంటే..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ఓపెన్ చేసి.. కార్నర్‌లో ఉన్న త్రి డాట్స్ మెనుపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ‘Settings’ ఓపెన్ చేసి అందులోని ‘Privacy’పై క్లిక్ చేయండి. అందులోని ‘Calls’పై నొక్కి వాట్సాప్‌లో గుర్తు తెలియని కాల్‌లను సైలెంట్ చేసేందుకు టోగుల్‌ను ప్రారంభించండి. అలా అన్ని రకాల గుర్తు తెలియని కాల్‌లను సైలెంట్ చేయొచ్చు. అయితే మీరు ఏదైనా కాలర్ నంబర్‌ను సేవ్ చేయకుంటే ముఖ్యమైన కాల్స్ మిస్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే మీరు ఈ ఫీచర్ పెట్టుకున్నప్పటికీ స్పామర్‌లు మీకు కాల్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే స్కామర్లు కాల్ చేసినప్పుడు మీకు తెలియదు అంతే.. ఫలితంగా మీరు వాటిని లిఫ్ట్ చేయలేదు. తద్వారా మోసపోకుండా ఉండేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..