WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే హ్యాక్ అవుతుంది జాగ్రత్త..

వాట్సాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం బయటపడటంతో CERT-In యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించి మీ ప్రైవేట్ చాట్స్, ఫైల్స్, బ్యాంక్ వివరాలను దొంగిలించే అవకాశం ఉంది. ఈ ముప్పు నుండి రక్షించుకోవడానికి మీ వాట్సాప్‌ను పాత వెర్షన్ల నుండి వెంటనే అప్‌డేట్ చేయాలని సూచించారు.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే హ్యాక్ అవుతుంది జాగ్రత్త..
Whatsapp Alert

Updated on: Nov 24, 2025 | 3:08 PM

వాట్సాప్.. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండడం చాలా అరుదు. ఈ యాప్ వచ్చినప్పటి నుంచి ముచ్చట్లన్నీ దీంట్లోనే. డైరెక్ట్‌గా మాట్లాడుకోవడమే తగ్గించేశారు. అంతలా మనిషి జీవితంలో భాగమైపోయింది వాట్సాప్. అటు మెటా కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తీసుకొస్తూ యూజర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తోంది. అయితే
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాట్సాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం బయటపడింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఉన్నత స్థాయి హెచ్చరికను జారీ చేసింది. హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించుకుని మీకు పెద్ద నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.

హ్యాకర్ల ముప్పు ఏమిటి?

CERT-In ప్రకారం.. వాట్సాప్ యొక్క రిచ్ రెస్పాన్స్ మెసేజ్ ఫీచర్‌లో ప్రధాన లోపం ఉంది. హ్యాకర్లు ఈ లోపాన్ని ఉపయోగించుకుంటే వారు మీ ఫోన్ లేదా Macను ఈజీగా హ్యాక్ చేయొచ్చు. లింక్స్ లేదా కోడ్ ద్వారా మీ వాట్సాప్‌లోని ప్రైవేట్ చాట్స్, ఫైల్స్, బ్యాంక్ వివరాలు వంటివి హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ప్రమాదంలో ఉన్న వెర్షన్లు

మీరు వాట్సాప్‌ను పాత వెర్షన్‌లలో వాడుతుంటే ఈ ప్రమాదం పొంచి ఉంది.

  • ఐఫోన్ వాట్సాప్: 2.25.23.73 కంటే పాత వెర్షన్లు
  • iOS వాట్సాప్ బిజినెస్: 2.25.23.82 కంటే పాత వెర్షన్లు
  • Mac వాట్సాప్: 2.25.23.83 కంటే పాత వెర్షన్లు

మీరు వెంటనే ఏమి చేయాలి?

ఈ ముప్పు నుండి బయటపడటానికి వాట్సాప్ ఇప్పటికే ఒక ప్యాచ్‌ను విడుదల చేసింది. యూజర్లు అందరూ వెంటనే వాట్సాప్ అప్‌డేట్ చేయాలని CERT-In కోరింది.

అప్‌డేట్ విధానం :

  • యాప్ స్టోర్ ఓపెన్ చేయండి.
  • WhatsApp కోసం శోధించండి.
  • అప్‌డేట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • సెట్టింగ్‌లలో ఆటోమేటిక్ అప్‌డేట్‌ ఆన్ చేయండి.

మీరు తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులు, ఫోటోలు లేదా వీడియోలను ఎప్పుడూ ఓపెన్ చేయవద్దు. మీ ప్రైవేట్ సమాచారం సేఫ్‌‌గా ఉండాలంటే ఈ చిన్న అప్‌డేట్ చాలా ముఖ్యం. ఇప్పుడే అప్‌డేట్ చేసుకుని సురక్షితంగా ఉండండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి