Vivo V21e 5G: వివో నుంచి వీ 21 ఈ 5 జీ ఫోన్ ఇండియాలో విడుదలైంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అందించారు. అలాగే వెనుకాల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో అందించారు. ఇన్-డిస్ల్పే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 24,990లుగా ఉంది. ఇది డార్క్ పెర్ల్, సన్‌సెట్ జాజ్ అనే రెండు రంగుల్లో లభించనుంది. ఈ ఫోన్ వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చని సంస్థ పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2,500 పూర్తి క్యాష్‌బ్యాక్ పొందవచ్చని వివో పేర్కొంది. ఈఎంఐ లావాదేవీలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ జూన్ 30 వరకు వివో ఇండియా స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అలాగే కస్టమర్లు రూ .50,000 విలువైన అమెజాన్ వోచర్‌ను కూడా పొందవచ్చని తెలిపింది.
వివో వీ21 ఈ 5 జీ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఫన్‌టచ్ ఓఎస్ 11.1 తో నడవనుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల పూర్తి-హెచ్‌డీ + అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో 8జీబీ LPDDR4x ర్యామ్, 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ తో 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరాల విషయానికి వస్తే.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఏర్పాటు చేశారు. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అలరించనుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, 5 జీ, ఎల్‌టీఈ, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి. కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో జీరో నుండి 72 శాతం వరకు ఛార్జ్ అవుతుందని వివో తెలిపింది. ఈ ఫోన్ కేవలం 7.67 మిమీ మందంతోపాటు 167 గ్రాముల బరువు ఉంది.
Also Read:
Realme Narzo: భారత మార్కెట్‌లోకి విడుదలైన రియల్ మీ ఫోన్లు; ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?