Vivo v29: భారత మార్కెట్లోకి వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే స్టన్ అవ్వాల్సిందే..
వివో వీ29 సిరీస్ పేరుతో ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధైంది. వీవో వీ29, వీవో వీ29 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈరోజు (అక్టోబర్ 5) ఈ ఫోన్‌లను వివో అధికారికంగా లాంచ్ చేయనుంది. తొలుత వీవో వీ29 ప్రోను అక్టోబర్ 5వ తేదీన లాంచ్ చేయనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇక వివో వీ29 సేల్ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది...
పండుగల సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలు. స్మార్ట్ టీవీలు మొదలు స్మార్ట్ ఫోన్స్ వరకు మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ఉన్న నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సైతం కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది.
వివో వీ29 సిరీస్ పేరుతో ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధైంది. వీవో వీ29, వీవో వీ29 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈరోజు (అక్టోబర్ 5) ఈ ఫోన్‌లను వివో అధికారికంగా లాంచ్ చేయనుంది. తొలుత వీవో వీ29 ప్రోను అక్టోబర్ 5వ తేదీన లాంచ్ చేయనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇక వివో వీ29 సేల్ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్, రియలన్స్ డిజిటల్‌తో పాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.
ధర విషయానికొస్తే వవో వీ29 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999గా నిర్ణయించారు. హిమాలయన్ బ్యూల, మాజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటలోకి తీసుకొస్తున్నారు. ఇక వివో వీ29 ప్రో ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999గా ఉండగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999గా ఉండనుంది. ఈ ఫోన్ హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.
ఇక ఆఫర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3500 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ. 3500 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు వీ షీల్డ్ ప్రొటెక్షన్‌తో పాటు వివో అప్‌గ్రేడ్ బోనస్‌ను అందించనున్నారు.
వివో వీ29 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రేష్‌రేట్‌తో పంచ్ హోల్ డిస్‌ప్లేను అందించారు. ఇక వివో వీ29 స్మార్ట్ ఫోన్స్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వివో వీ29 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీతో పని చేస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తాయి. కెమెరా విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లోనూ 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందిస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే రెండు ఫోన్స్‌లోనూ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..