Vivo v30: కళ్లు చెదిరే ఫీచర్లతో వివో కొత్త ఫోన్.. ధర ఎంతో తెలుసా.?
వివో వీ30 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో...
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మధ్యకాలంలో బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్న వివో తాజాగా మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వీ30 సిరీస్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా వివో వీ30, వివో వీ30 ప్రో అనే రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
వివో వీ30 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.4, వైఫై 5, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 80 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 33,999కాగా 8జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 35,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 37,999గా నిర్ణయించారు.
వీ30 ప్రో ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 41,999కాగా,12 జీబీ ర్యామ్, 512 జీబీ వేరియంట్ ధర రూ. 46,999గా నిర్ణయించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..