AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్ లాంచ్‌.. రూ. రెండు వేలు తగ్గిన ధర..

వివో వై56 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరిలో లాంచ్‌ చేసిన వివో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 18,999గా నిర్ణయించారు. అయితే తాజాగా ఇదే ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం వివో లాంచ్‌ చేసింది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ధర పాత వేరియంట్‌తో పోల్చితే రూ. 2 వేలు తగ్గింది...

Vivo Y56: వివో వై56లో కొత్త వేరియంట్ లాంచ్‌.. రూ. రెండు వేలు తగ్గిన ధర..
Vivo Y56
Narender Vaitla
|

Updated on: Sep 25, 2023 | 3:59 PM

Share

పండుగల నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నాయి టెక్‌ దిగ్గజాలు. ఈ నేపథ్యంలో రోజుకో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వివో ఈ రేసులో ముందు వరుసలో నిలుస్తోంది. మొన్నటి మొన్న వివో వై56 పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన వివో.. తాజాగా ఇదే మోడల్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది.

వివో వై56 స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరిలో లాంచ్‌ చేసిన వివో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 18,999గా నిర్ణయించారు. అయితే తాజాగా ఇదే ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను సోమవారం వివో లాంచ్‌ చేసింది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ధర పాత వేరియంట్‌తో పోల్చితే రూ. 2 వేలు తగ్గింది. 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధరను రూ. 16,999గా నిర్ణయించారు.

కేవలం ర్యామ్‌ విషయంలో మాత్రమే మార్పు చేసినట్లు, ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 700, ఆక్టాకోర్ 5జీ బేస్డ్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 18 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకునే అవకాశం ఉండడం విశేషం. ఇక స్టోరేజ్‌ను కూడా మైక్రోఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ54 రేటింగ్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్‌ ఇంజన్‌, ఆరెంజ్‌ షిమ్మర్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ అమ్మకాలు జరుగుతున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..