Truecaller: అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ట్రూకాలర్‌.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Truecaller: ట్రూకాలర్‌ యాప్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ డౌన్‌లోడ్స్‌తో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుందీ యాప్‌. ఎప్పటికప్పుడు కొంగొత్త...

Truecaller: అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ట్రూకాలర్‌.. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Truecaller
Follow us

|

Updated on: Nov 26, 2021 | 4:25 PM

Truecaller: ట్రూకాలర్‌ యాప్‌కు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ డౌన్‌లోడ్స్‌తో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుందీ యాప్‌. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది కాబట్టే ఈ యాప్‌కు అంత క్రేజ్‌ ఉంది. ఇలా రకరకాల ఫీచర్లను పరియం చేస్తున్న ట్రూకాలర్‌ తాజాగా మరిన్ని కొత్త ఫీచర్లను యాప్‌కు జోడించింది. సరికొత్త కాలింగ్‌ అనుభూతిని అందించడానికి ట్రూకాలర్‌ తీసుకొచ్చిన ఈ ఫీచర్లపై మీరూ ఓ లుక్కేయండి..

కాల్స్‌, మెసేసేజెస్‌ సెపరేట్ ట్యాబ్‌..

ఇకపై యూజర్లు కాల్స్‌, మెసేజ్‌లను వేరు వేరు ట్యాబ్‌లలో చూసుకునే అవకాశాన్ని కలిపించింది ట్రూకాలర్‌. ఇందుకోసం ఓ ప్రత్యేక ఫీచర్‌ను యాడ్ చేసింది. దీంతో మీకు వచ్చిన కాల్స్‌, మెసేజ్‌లను వేరు వేరుగా చూసుకోవచ్చు.

కాలర్‌ ఐడీకి వీడియో..

యూజర్లు ఇకపై కాలర్‌ ఐడీకి తమ వీడియోను జోడించే అవకాశాన్ని కలిపించారు. దీనిద్వారా ఎవరికైనా వీడియో కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేసిన వెంటనే ముందుగా వీడియో కనిపించేలా రికార్డు చేసిన వీడియోను జోడించవచ్చు.

కాల్ రికార్డింగ్‌ అందరికీ..

గతంలో కాల్‌ రికార్డింగ్‌ ఆప్షన్ కేవలం ప్రీమియం యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ట్రూకాలర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో ఉచితంగా ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

ఘోస్ట్‌ కాల్‌ ఫీచర్‌..

ఈ ఫీచర్‌తో యూజర్లు ప్రాంక్‌ కాల్స్‌ చేసి స్నేహితులను ఆటపట్టించొచ్చు. ఇతరులకు కాల్‌ చేసినప్పుడు తమ వివరాలు కాకుండా ఇతరుల పేరు, నంబర్‌ లేదా ఫొటో కనిపించేలా మార్పులు చేయొచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్‌ ప్రాంక్‌ కాల్స్‌ను నిర్ణీత సమయానికి షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ కేవలం ప్రీమియం, గోల్డ్‌ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది.

ఫోన్‌ ఎవరు చేశారో చెబుతుంది..

ట్రూకాలర్‌ తీసుకొచ్చిన మరో ఫీచర్‌ కాల్‌ అనౌన్స్‌. దీని ద్వారా మీకు ఫోన్‌ చేసిన వ్యక్తి పేరు, నంబర్‌ వంటి వివరాలు ట్రూకాలర్‌ యాప్‌ పెద్దగా చదివి వినిపిస్తుంది. ఈ ఫీచర్‌ను కూడా ప్రీమియం, గోల్డ్‌ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు.

Also Read: Missing Parrot: తప్పిపోయిన రామ చిలుక కోసం యజమాని వెదుకులాట.. తెచ్చి ఇస్తే.. రూ. 15 వేలు రివార్డ్ ఎక్కడంటే..

Earth Quake: మిజోరంలో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి

Acharya: మెగాస్టార్ మూవీకి భారీ డిమాండ్.. “ఆచార్య” ఓటీటీ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..