TRAI New Rules: డిసెంబర్ 1 నుండి ట్రాయ్ కొత్త నిబంధనలు.. ఓటీపీ మేసేజ్ ఆలస్యం ఎందుకో తెలుసా?

TRAI New Rules: భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుండి నకిలీ కాల్‌లు, సందేశాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకురానుంది. దీని ఫలితంగా ఇకపై ఓటీపీ మెస్సేజ్‌లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.

TRAI New Rules: డిసెంబర్ 1 నుండి ట్రాయ్ కొత్త నిబంధనలు.. ఓటీపీ మేసేజ్ ఆలస్యం ఎందుకో తెలుసా?
Follow us
Ranjith Muppidi

| Edited By: Subhash Goud

Updated on: Nov 28, 2024 | 4:32 PM

ఓటీపీ.. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన దగ్గరి నుండి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకు, ఫుడ్, డెలివరీ ఏదైనా ఓటీపీలు తప్పనిసరి. చివరి కొరియర్ సర్వీసులు కూడా ఓటీపీ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఇది కస్టమర్ల భద్రతకు ఉపయోగపడుతున్నా, కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఎంతో మంది డబ్బులు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి.

ఈ నేపథ్యంలో భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుండి నకిలీ కాల్‌లు, సందేశాలను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకురానుంది. దీని ఫలితంగా ఇకపై ఓటీపీ మెస్సేజ్‌లు కాస్త ఆలస్యంగా రానున్నాయి. ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత అవాంఛిత కాల్‌ల సమస్య తొలగిపోనుంది. దీంతో పాటు నకిలీ సందేశాలు, కాల్‌లను ఫిల్టర్ చేయడంలో బ్యాంకింగ్ సందేశాలు, ఓటీపీలను పొందడంలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఓటీపీలు ఆగిపోతే మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. అలాగే ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్‌ చేసిన తర్వాత డెలివరీ సమయంలో మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేస్తేనే మీ ప్రొడక్ట్‌ను అందుతుంది. దీంతో ఓటీపీలు రాకుండా ఆలస్యమైనా ఆన్‌లైన్‌ డెలివరీని తీసుకోలేరు.

ట్రాయ్ నిబంధనలకు లోబడని SMS లేదా Android యాప్ APK ఫైల్‌లను బ్లాక్ చేయాలని TRAI నిర్ణయించింది. ఈ లింక్ లేదా మెసేజ్‌పై క్లిక్ చేయడం ద్వారా, హ్యాకర్లు మొబైల్ నుండి మొత్తం సమాచారాన్ని, డబ్బును లాక్కుంటారు. ఇలాంటి మోసాలు జరగకుండా ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఓటీపీ ప్రాతిపదికన పనిచేసే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు, వారి పేర్లును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. లేదంటే పంపిన మెసేజ్ లేదా OTP కస్టమర్ ఫోన్‌కు చేరదు. బ్యాంకులు, పేమెంట్ ఆపరేటర్ల నుండి Zomato, Uber వంటి యాప్‌ల వరకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. URLలు, OTT లింక్‌లు, APKలు (Android అప్లికేషన్ ప్యాకేజీలు) లేదా కాల్ బ్యాక్ నంబర్‌లను కలిగి ఉన్న సందేశాలను బ్లాక్ చేయాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ సందేశాలు, ఓటీపీ టెంప్లేట్‌లు, కంటెంట్‌ని జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్‌లతో నవంబర్ 31 లోపు నమోదు చేసుకోవాలి. టెలికాం కంపెనీలతో పాటు ఫుడ్ డెలివరీ సంస్థలు ట్రాయ్ నిబంధనలకు ఒకే చెప్పకపోతే ఓటీపీలు నిలిచిపోయే పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చెప్పాలంటే డిసెంబర్ 1 నుండి వినియోగదారులు ఓటీపీ మెస్సేజ్ పొందడంలో ఆలస్యం తప్పదు. ఇదంతా వినియోగదారుల భద్రత కోసమేనని ట్రాయ్ స్పష్టం చేసింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
అమేజింగ్.. అదరహో అనేలా ట్యాంక్‌ బండ్‌పై ఎయిర్‌ షో.. వీడియో
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
నడవలేని స్థితిలో మంచు మనోజ్..
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
అసలు వినోద్ కాంబ్లికి ఏమైంది? ఏ వ్యాధితో బాధపడుతున్నాడు?
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఇవి ధాన్యం కాదు.. మధుమేహులకు దివ్యౌషధం..! ఇలా తింటే ఆ సమస్యలన్నీ
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
ఓజీ vs హరిహరవీరమల్లు లో పవర్‌స్టార్‌ ఎటు మొగ్గుతారు.? ఇదే ట్రెండ్
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..
సింపుల్‏గా గుడిలో పెళ్లి చేసుకున్న స్టార్ నటుడి తనయుడు..