Mymanu Earbuds: వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌లో టైటాన్ మతిపోయే ఆవిష్కరణ.. 4 జీ కనెక్టవిటీతో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు

|

Mar 08, 2023 | 1:30 PM

మైమనూ ఎండబ్ల్యూసీ 2023 ప్రపంచంలోనే మొట్టమొదటి 4జీ కనెక్టవిటీతో ఉన్న వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను రిలీజ్ చేసింది. మైమను టైటాన్ ఇయర్ బడ్స్ 37 పైగా భాషల్లో ప్రత్యక్ష అనువాదంతో పాటు వాయిస్ నియంత్రణలతో వస్తాయి.

Mymanu Earbuds: వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌లో టైటాన్ మతిపోయే ఆవిష్కరణ.. 4 జీ కనెక్టవిటీతో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు
Mymanu
Follow us on

భారతదేశంలో యువత ఎక్కువ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు. మ్యూజిక్, వీడియోలను ఎంజాయ్ చేయడానికి బ్లూటూత్ కనెక్టవిటీతో పని చేయడంతో వీటిన ఎక్కువ ఆధరిస్తున్నారు. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లతో పని చేసే ఇయర్ బడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. మైమనూ ఎండబ్ల్యూసీ 2023 ప్రపంచంలోనే మొట్టమొదటి 4జీ కనెక్టవిటీతో ఉన్న వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను రిలీజ్ చేసింది. మైమను టైటాన్ ఇయర్ బడ్స్ 37 పైగా భాషల్లో ప్రత్యక్ష అనువాదంతో పాటు వాయిస్ నియంత్రణలతో వస్తాయి. ప్రస్తుతం ఈ బడ్స్ స్మార్ట్ ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటాయా? లేదా? అని పరీక్షిస్తున్నారు. ఈ ఆవిష్కరణ సక్సెస్ అయితే ఇయర్ బడ్స్ ఫోన్ అవసరాన్ని పరిమితం చేస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లోకి ఈ-సిమ్ రాకతో స్మార్ట్ ఫోన్ సహాయం లేకుండా కాల్స్, ఎస్ఎంఎస్‌లు చేసుకునే అవకాశం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. టైటాన్ ఇయర్ బడ్స్ సెల్యూలార్ డేటా ద్వారా ఇంటర్‌నెట్‌కు కనెక్ట్ చేయవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

టైటాన్ ఇయర్ బడ్స్‌లో వాయిస్ అసిస్టెంట్ సేవల కోసం మై జునో యాప్‌తో కనెక్ట్ చేయాలి. అలాగే ఈ ఇయర్ బడ్స్‌లో థర్డ్ పార్టీల ద్వారా మెసేజ్, డేటా అంతరాయాన్ని నివారించడానికి ఎంటర్ ప్రైజ్ గ్రేడ్ సెక్యూరిటీతో వస్తాయి. ముఖ్యంగా ఫోన్ తీసుకెళ్లలేని ప్రాంతాలకు ఈ ఇయర్ బడ్స్ తీసుకెళ్లి సేవలను పొందవచ్చు. ఈ టెక్నాలజీ కంపెనీ స్క్రీన్ ఫ్రీ వరల్డ్‌గా పేర్కొంటుంది. సూపర్ సౌండ్ క్వాలిటీతో వచ్చే ఈ ఇయర్ బడ్స్ వాటర్ రెసిస్టెంట్ అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఇయర్ బడ్స్‌ను స్క్రీన్ లెస్ మొబైల్‌గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఇయర్ బడ్స్ ధర దాదాపు 400 డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ఇయర్ బడ్స్ యూరోప్, యూఎస్‌లో కొనుగోలు చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్ బడ్స్ భారత మార్కెట్‌లోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయో? అనే విషయం కంపెనీ స్పష్టం పేర్కొనలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..