AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థంప్స్ అప్ ఎమోజి పెట్టాడు.. రూ. 50 లక్షల జరిమానా కట్టాడు.. కోర్టు తీర్పుతో షాకయ్యాడు..

Thumps up Emoji: సోషల్ మీడియాలో రాయడానికి బదులు ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని రకాల ఎమోజీలను విచక్షణారహితంగా ఉపయోగిస్తున్నారు. ఇది మొబైల్‌లో అభివృద్ధి చేయబడిన కొత్త ఫీచర్. కానీ అది కూడా చిక్కుకుపోవచ్చు.

థంప్స్ అప్ ఎమోజి పెట్టాడు.. రూ. 50 లక్షల జరిమానా కట్టాడు.. కోర్టు తీర్పుతో షాకయ్యాడు..
Thumps Up Emoji
Sanjay Kasula
|

Updated on: Jul 10, 2023 | 11:20 AM

Share

సోషల్ మీడియాలో మనం తరచుగా వివిధ రకాల లైక్-డిస్‌లైక్ ఎమోజీలను ఉపయోగిస్తుంటాం. వాటిలో ఒకటి థంప్స్ అప్ ఎమోజి.. దీనిలో బొటనవేలు ముద్ర పైకి చూపబడుతుంది. అయితే ఈ ఎమోజీ ఇప్పుడు ఓ వ్యక్తిని చిక్కుల్లోకి నెట్టేసింది. ఇప్పుడు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకోనేందుకు కారణంగా మారింది. థమ్స్ అప్ ఎమోజీతో సమ్మతి తెలిపినందుకు ఒక వ్యక్తికి కోర్టు రూ. 50 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటన కెనడాలో జరిగింది. థమ్స్ అప్ ఎమోజీని సంతకంగానే పరిగణించాలని కోర్టు ఇచ్చిన తీర్పు… ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. కాబట్టి మీరు పబ్లిక్‌గా ఇలాంటి ఎమోజీ ఉపయోగించేటప్పుడు అజాగ్రత్తగా ఉండండి.

మీరు ఒకరి ప్రపోజల్‌పై థమ్‌స్ అప్ ఎమోజీని పంపినట్లయితే.. మీరు ఆ ప్రతిపాదనపై సంతకం చేశారని అర్థం. ఇది ఒక రకమైన ఒప్పందం అవుతుంది. కెనడాలోని సస్కట్చేవాన్‌లోని కింగ్స్ బెంచ్ కోర్టులో ఈ నిర్ణయం వెలువడింది.

విషయం ఏంటంటే

ఈ కేసుకు రెండేళ్లు పూర్తవుతుండగా.. ఇప్పుడు నిర్ణయం కోర్టు నుంచి వెలువడింది. ఒక ధాన్యం వ్యాపారి ఒక రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని పంపాడు. ధర వగైరా ఆ ఒప్పందంలో రాసి ఉంది. మొబైల్‌లో ఒప్పందం పొందిన తర్వాత.. రైతు ఆ వ్యాపారికి థమ్స్ అప్ ఎమోజీని పంపాడు. డీల్ జరిగిందని వ్యాపారికి అర్థమైంది. అయితే డెలివరీ వంతు రాగానే ధర పెరుగుతుందని రైతు నిరాకరించాడు.

ఈ విషయమై ధాన్యం వ్యాపారి కోర్టును ఆశ్రయించగా.. రైతు పంపిన థమ్స్‌అప్ ఎమోజీని రుజువుగా చూపించాడు. అయితే థమ్స్‌అప్‌ ద్వారా తనకు ఆఫర్‌ వచ్చిందని చెప్పదలుచుకున్నట్లు రైతు తెలిపాడు. ఒప్పందానికి సమ్మతించినట్లుగా కాదని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, దాని అర్థం అలా కాదని కోర్టు తీర్పులో తెలిపింది. ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులు తెరపైకి వచ్చాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. కొత్త సాంకేతిక మార్గాల యుగంలో, థంబ్స్ అప్ ఎమోజి మీరు పంపిన పత్రంపై సంతకం చేయడానికి సమానం.

ఎమోజి చట్టపరమైన ఆధారం

సూపర్ లాయర్స్ నివేదిక ప్రకారం, ఎమోజీని ఉపయోగించడం కోర్టు, చట్టం సందర్భంలో చోటు చేసుకుంది. వర్జీనియాలోని 12 ఏళ్ల బాలుడు ఎమోజీని ఉపయోగించి బెదిరింపు సందేశాలు పంపినందుకు నేరారోపణలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో, టెక్స్ట్ సందేశాల ద్వారా పంపబడిన ఎమోజీతో కూడిన వీలునామా కూడా న్యూజిలాండ్‌లో ఉంచబడింది.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం