
Royal Enfield Bike: ఇండియన్ బైక్ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేది ఒక సంచలనం. ఈ కంపెనీ తయారు చేసిన మోటార్‌సైకిళ్లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం 7 మోడల్స్ ఉన్నాయి. మీకు బుల్లెట్‌పై పిచ్చి ఉంటే కొత్తది కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ విషయం తెలుసుకోండి. రాయల్ ఎన్ఫీల్డ్ చౌకైన బైక్ బుల్లెట్ 350 మోడల్. ఈ 346 సిసి బైక్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌తో ఉంటుంది. ఈ బైక్ బరువు 191 కిలోలు. ఈ బైక్ ఏ వేరియంట్ చౌకగా ఉంటుంది. దాని ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ ఫీచర్లు..?
1. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ మూడు వేరియంట్లలో వస్తుంది.
2. బుల్లెట్ 350 స్టాండర్డ్, బుల్లెట్ 350 కెఎస్, బుల్లెట్ 350 ఈఎస్
3. ఈ మూడు వేరియంట్లలో చౌకైనది బుల్లెట్ 350 స్టాండర్డ్.
4 . BS6 ఇంజిన్‌తో కూడిన ఈ మోడల్ 19.1 bhp, 28 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
5. ఈ వేరియంట్‌లో మీరు అల్లాయ్‌లు కాకుండా స్పోక్ వీల్స్‌ను పొందుతారు.
6. ఢిల్లీలో బుల్లెట్ 350 స్టాండర్డ్ ఆన్ రోడ్ ధర రూ. 1.68 లక్షలు.
7. బుల్లెట్ 350 మోడల్‌లో కంపెనీ 13.5 లీటర్ల ట్యాంక్‌ను అందించింది.
8. ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఇచ్చారు.
9. ఈ మోడల్ మూడు వేరియంట్లు 6 విభిన్న రంగులలో ఉన్నాయి.
10. ఈ మోడల్ మైలేజ్ లీటరుకు 38 కేఎంపీఎల్ అని కంపెనీ పేర్కొంది.
మరిన్ని టెక్నాలజి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి