Telugu News Technology These passwords can be hacked within 1 second full list here details in telugu
Cyber Security: భద్రతకు కీలకంగా పాస్‌వర్డ్స్.. ఆ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటే ఇక అంతే..!
ఇటీవల కాలంలో మారిన టెక్నాలజీ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్లు, మెయిల్స్ ఇతర అకౌంట్స్ నిర్వహణలో పాస్‌వర్డ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాస్‌వర్డ్స్ అనేవి వ్యక్తిగత ధ్రువీకరణలో కీలకంగా ఉంటున్నాయి. కొంత మంది ఈ పాస్‌వర్డ్స్ సెట్ చేసుకునే విషయంలో అలసత్వం వహిస్తున్నారు. హ్యాకర్లు ఈ విషయాన్ని అలుసుగా తీసుకుని బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముతో పాటు మన వ్యక్తిగత డేటా తస్కరిస్తున్నారు.
సైబర్ సెక్యూరిటీకు పాస్‌వర్డ్ అనేది వెన్నెముకగా ఉంటుంది. బ్యాంక్ ఖాతాలు, వెబ్ సైట్లలో మన డేటా సురక్షితంగా ఉంచుకోవాలంటే పాస్‌వర్డ్స్ కీలకం. ఇటీవల కాలంలో సైబర్ భద్రతా ఉల్లంఘన కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రజలు ఇప్పటికీ బలహీనమైన సాధారణ పాస్‌వర్డ్స్ పెడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ‘12345’ లేదా ‘పాస్‌వర్డ్’ వంటి హ్యాకర్లు సులభంగా ఊహించేలా పాస్‌వర్డ్స్ పెడుతున్నారు. ఇలాంటి పాస్‌వర్డ్స్ ద్వారా ఒక సెకను కంటే తక్కువ సమయంలో మీ ఖాతాలోకి చొరబడే అవకాశం ఉంది. ఇటీవల భారతదేశంతో సహా 44 దేశాల్లో వివిధ పరిశోధనల్లో తేలిన సాధారణ పాస్‌వర్డ్స్ గురించి తెలుసుకుందాం.
సాధారణ పాస్ వర్డ్స్ ఇవే
123456
123456789
12345678
సీక్రెట్ పాస్‌వర్డ్
క్వెర్టీ 1
111111
123123
1234567890
www.1234567890
క్వెర్టీ
www.1234567
ఎబిసి123
ఐ లవ్ యూ
123123123
000000
123456
పాస్‌వర్డ్ 1
987654321
666666
జాగ్రత్తలు తప్పనిసరి
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సురక్షితమైన పాస్‌వర్డ్‌లకు సంబంధించిన పలు మార్గదర్శకాలను ఇటీవల జారీ చేసింది.
కనీసం 8 అక్షరాల పొడవు ఉన్న సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఒక అంకె, కనీసం ఒక స్పెషల్ క్యారెక్టర్‌తో పాస్‌వర్డ్ పెట్టుకోవాలని స్పషం చేస్తున్నారు.
కనీసం 120 రోజులకు ఒకసారి మీ పాస్‌వర్డ్స్‌ను మార్చాలి. అలాగే అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో, మల్టీ-ఫ్యాక్టర్ ప్రామాణీకరణను యాక్టివేట్ చేసుకోవడం ఉత్తమమని పేర్కొంటున్నారుఅధునాతన సాంకేతికతను ఉపయోగించండి.
అలాగే ఒకే పాస్‌వర్డ్‌ను బహుళ వెబ్‌సైట్స్‌ను ఉపయోగించకూడదు.
బ్రౌజర్స్‌లో పాస్‌వర్డ్స్ సేవ్ చేయకూడదని అలాగే ఎక్కడా మీ పాస్‌వర్డ్స్‌ను రాయకూడదు.
ఆరు సంవత్సరాల విలువైన డేటాను విశ్లేషించినప్పుడు ప్రజల పాస్‌వర్డ్ అలవాట్లు మారలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.